వ్యాపారము

Bima Yojana: కేంద్రం సూపర్ స్కీమ్.. రూ.30 ఆదా చేస్తే రూ.4 లక్షలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ తో పాటు ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో మరో స్కీమ్ ను తెలుస్తోంది. ఈ రెండు స్కీమ్స్ వల్ల ఏకంగా 4 లక్షల రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుంది. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ కింద రూ.2 లక్షలు ప్రమాద బీమా కింద పొందవచ్చు.

ఈ స్కీమ్ కోసం ఏడాదికి 12 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మే నెలలో ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియం ఖాతా నుంచి కట్ అవుతుంది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాగా ఈ స్కీమ్ కింద 2 లక్షల రూపాయల వరకు జీవిత బీమా లభిస్తుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు సంవత్సరానికి 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతా నుంచి ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతాయి.

ప్రతి సంవత్సరం 342 రూపాయలు చెల్లించడం ద్వారా 4 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. నెలకు కేవలం 30 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఈ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్స్ లో చేరడం వల్ల ప్రజలకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పాలసీలు ఉపయోగపడతాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందాలని అనుకునే వాళ్లకు ఈ పాలసీలు ప్రయోజనకరంగా ఉంటాయి.

Back to top button