వ్యాపారము

Jharkhand Man’s Floriculture: పూలతో లక్షల్లో సంపాదిస్తున్న రైతు.. ఎలా అంటే..?

కష్టపడే సత్తా, తెలివితేటలు ఉంటే జీవితంలో సక్సెస్ కావడం కష్టం కాదు. శ్యామ్ సుందర్ బెడియా అనే రైతు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం పూలసాగు చేస్తున్న ఈ రైతు పూలసాగు ద్వారా ఏకంగా లక్షల్లో సంపాదిస్తుండటం గమనార్హం. బాల్యంలో డబ్బు లేకపోవడం వల్ల చదువుకోలేకపోయిన శ్యామ్ సుందర్ బెడియా బాగా పని చేస్తున్న జార్ఖండ్ ప్రభుత్వ రైతులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

2010 సంవత్సరంలో శ్యామ్ సుందర్ బెడియా పూలసాగును మొదలుపెట్టారు. శ్యామ్ సుందర్ పూల పెంపకాన్ని మొదలుపెట్టిన సమయంలో అతని కుటుంబం దయనీయమైన జీవితాన్ని గడిపింది. రామకృష్ణ మిషన్ సహాయంతో వ్యవసాయంలో శిక్షణ తీసుకున్న శ్యామ్ సుందర్ గులాబీ, గెర్బెరా పువ్వులను మొదట సాగు చేసేవారు. మొదట ఎకరాలో పూల పెంపకం చేపట్టిన శ్యామ్ సుందర్ బెడియా ప్రస్తుతం 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

శ్యామ్ సుందర్ ఏకంగా నాలుగు వేల మంది రైతులకు ఇప్పటివరకు పూల సాగు విషయంలో శిక్షణ ఇచ్చారు. సంవత్సరానికి పూల పెంపకం ద్వారా శ్యామ్ సుందర్ ఎనిమిది లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. పూలసాగు చేయడం ద్వారా ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో పాటు శ్యామ్ సుందర్ బేడియా కారును కూడా కొనుగోలు చేయడం గమనార్హం.

బంతి పువ్వు, గులాబీ, గెర్బెరా, గ్లాడియులస్ పూలను శ్యామ్ సుందర్ తన పొలంలో పండిస్తారు. శ్యామ్ సుందర్ పూల పెంపకం ద్వారా ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కూరగాయల పెంపకం కంటే ఎక్కువ మొత్తంలో లాభాలను పూల పెంపకం ద్వారా శ్యామ్ సుందర్ సంపాదిస్తున్నారు.

Back to top button