విద్య / ఉద్యోగాలు

Job In Air India: ఎయిర్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా..?

ఎయిర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 22 ఖాళీలను భర్తీ చేయడానికి ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. పరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలను కలిగి ఉంటారో వాళ్లు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. http://aiesl.airindia.in/ వెన్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆగష్టు 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌ ఉద్యోగ ఖాళీలు 8 ఉండగా అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ అకౌంట్స్‌ ఉద్యోగ ఖాళీలు 14 ఉన్నాయి.

ఎంబీఏ, ఐసీఏ, ఐసీఎంఏ పాసైన వాళ్లు ఫైనాన్స్ పోస్టులకు కామర్స్‌లో డిగ్రీ పాసైన వాళ్లు అకౌంట్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఈ ఏడాది ఆగష్టు 1 నాటికి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకుని సర్టిఫికెట్లను జత చేసి సంస్థ ఢిల్లీ అడ్రస్ కు పంపాలి.

నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరగనుంది. నిరుద్యోగులకు సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

Back to top button