టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

ఎన్టీఆర్ నాలుగు కోట్ల కారు ఆమె కోసమే !

Jr NTR bought a luxury carఎన్టీఆర్ ఇటాలియన్ లగ్జరీ కారు ‘Lamborghini Urus’ని కొన్నాడని ఆ మధ్య వార్తలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట ఈ కారు. అయితే ఈ కారు ఇపుడు ఎన్టీఆర్ ఇంటికి చేరింది. స్వతహాగా తారక్ కి లగ్జరీ కార్లు అంటే ఎంతో ఆసక్తి. అందుకే తన కోసం ఈ కారును ముచ్చటపడి కొనుకున్నారని అనుకున్నారు అందరూ.

కానీ, ఎన్టీఆర్ ఈ కారు కొన్నది తన కోసం కాదు. మరి ఎవరి కోసం ? ఎన్టీఆర్ ఆ కారు కొన్నది ఒకామె కోసమట. నాలుగు కోట్లు విలువ చేసే కార్ గిఫ్ట్ గా ఇస్తున్నాడంటే.. ఆమె ఎవరై ఉంటారు అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు, ఎన్టీఆర్ ‌ తల్లి ‘షాలిని’, అవును తన తల్లి కోసం ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేయించారు.

అలాగే కార్ రిజిస్ట్రేషన్ ను కూడా తారక్, షాలినిగారి పేరు మీదే చేయించాడు. నిజానికి షాలిని ఎక్కువుగా బయటకు రారు, అయినా ఎన్టీఆర్ ఈ కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడానికి ముఖ్య కారణం, ఫ్యామిలీ ఫంక్షన్లకు గుడికి వెళ్ళటానికి ఆమె కోసం తారక్ ఈ కారును కొన్నాడు. ఏది ఏమైనా సినిమా స్టార్స్ కి ఖరీదైన కార్లు కొనడం అనేది సర్వసాధారణం అయిపోయింది.

ప్రతి హీరోకి ఇలాంటి ప్రతేకమైన వెహికల్స్ నాలుగైదు ఉన్నాయి. ముఖ్యంగా లాంబోర్గిని కార్లు అంటే సూపర్ స్టార్లకు మహా సరదా. రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ కి ఇప్పటికే ఈ కార్లు ఉన్నాయి. ఇప్పుడు వారి లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా చేరాడు. ఇక ప్రస్తుతం తారక్ జెమినీ టీవీ ప్రసారం చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో షూట్ లో పాల్గొంటున్నాడు.

Back to top button