గుసగుసలుటాలీవుడ్సినిమా

త్రివిక్రమ్ నిర్ణయంపై ‘యంగ్ టైగర్’ అసంతృప్తి?


డైరెక్టర్ త్రివిక్రమ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే మూవీ అటకెక్కిందనే ప్రచారం జరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే. లాక్డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఇప్పట్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో ఎన్టీఆర్ తన డేట్స్ ను ‘ఆర్ఆర్ఆర్’ కోసం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని జూలై వరకు కాంప్లీట్ చేసి వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ వాయిదా పడటంతో దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి మూవీని ఎన్టీఆర్ తో కాకుండా విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!

దర్శకుడు త్రివిక్రమ్ తీసుకున్న నిర్ణయంపై యంగ్ టైగర్ ఒకింత అసంతృప్తితో ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల త్రివిక్రమ్ ‘అలవైకుంఠపురములో’ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు. ఈ విజయం తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో మూవీ వస్తే తన సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని భావించాడు. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో ఎన్టీఆర్ మూవీని త్రివిక్రమ్ వాయిదా వేసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ పార్ట్ కాంప్లీట్ అయ్యేలోపు వెంకీతో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే వెంకటేష్ మూవీ అటు, ఇటుగా ఆ ప్రభావం తన మూవీపై పడుతుందనే భావనలో ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

మద్యం ప్రియులపై మరో పిడుగు..!

ఈమేరకు త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నాడని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. దీంతో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కాంప్లీట్ చేశాక వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే మూవీని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈమేరకు ఎన్టీఆర్ సన్నిహితులు తప్పకుండా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో మూవీ ఉంటుందని చెబుతున్నారు.