టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

హీరోతో ‘గుత్తా జ్వాల’ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ !

ఎట్టకేలకూ ‘గుత్తా జ్వాల’కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. ఈ సీనియర్ భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ తమిళ హీరో విష్ణు విశాల్‌ తో మొత్తానికి ఏప్రిల్‌ 22న పెళ్లి పీటలెక్కనుంది. ఉగాది పండగ రోజున ఈ విషయాన్ని విష్ణు విశాల్ అధికారికంగా వెల్లడించారు. పనిలో పనిగా ఈ మేరకు లగ్న పత్రికను కూడా షేర్‌ చేశాడు. అయితే కరోనా సెకెండ్ వేవ్ తో కరోనా విజృంభిస్తున్న కారణంగా.. తమ పెళ్ళికి అందరికీ ఆహ్వానించడం లేదని ఈ హీరో స్పష్టం చేశాడు. ఇక కేవలం ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది సమక్షంలోనే వివాహం చేసుకోబోతున్నారు ఈ జంట.

అన్నట్టు గతేడాది సెప్టెంబర్‌ లో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. ఇక ఆ మధ్య విష్ణు విశాల్ ‌తో తన రహస్య సంబంధాన్ని బహిరంగానే ధృవీకరించిన జ్వాల.. ప్రేమలో మేము చాల లోతులో ఉన్నామని, అలాగే మాది గౌరవంతో కూడుకున్న ప్రేమ అని ఇలా తన ప్రేమ గురించి ఓ థీరినే చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ నెల 22వ తేదీన ఈ ఇద్దరూ ఒక ఇంటవారు కాబోతున్నారు. అయితే ఇక వీరిద్దరికీ రెండో పెళ్లి కావడం విశేషం. నటుడు విష్ణు విశాల్‌ 2010లో రజనీ నటరాజన్‌ ను పెళ్లి చేసుకోగా వారికి ఆర్యన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

అయితే, వీరి మనస్పర్థల కారణంగా 2018లో వారిద్దరూ విడిపోయారు. అయితే, విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి కారణం గుత్తా జ్వాలనేనని విమర్శిస్తున్నారు. కానీ జ్వాల ఇలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోదు అనుకోండి. జ్వాల గతంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయింది. ఇప్పుడు హీరో విష్ణు విశాల్‌ తో మళ్ళీ పెళ్లికి రెడీ అయింది. కనీసం ఈ వివాహం అయినా జీవితాంతం ఆనందంగా కొనసాగాలని కోరుకుందాం.

Back to top button