సినిమా వార్తలు

కాజల్ వల్ల ‘పుష్ప’ ఐటమ్స్ కి ఫేమస్ !

Kajal
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ తో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తుండేసరికి.. సుకుమార్ చిన్న చిన్న పాత్రలకు కూడా పెద్దవాళ్ళను పెట్టుకుంటూ పోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో గ్లామర్ భామ కాజల్ ను ఒక పాత్ర కోసం సుక్కు తీసుకుంటున్నాడట. అయినా ఈ సినిమాలో కాజల్ ఏ పాత్రకు అనుకుంటున్నారా ? కాజల్ ఇందులో నటిగా కాదులెండి, ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకుంటున్నారట. ఈ సినిమా కోసం ఓ సూపర్ డాన్స్ నంబర్ ను ప్లాన్ చేసాడట సుక్కు.

నిర్మాతలు మొదట ఈ సాంగ్ లో హాట్ యాంకర్ అనసూయను చూపిద్దామని అనుకున్నా.. సుక్కు మాత్రం కాజల్ అయితే బెటర్ అని చెప్పడంతో ప్రస్తుతం కాజల్ తో నిర్మాతలు మాట్లాడి ఫైనల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ లో హాట్ హాట్ ఐటెమ్ సాంగ్తో అదరగొట్టిన కాజల్, మొత్తానికి మరో సాంగ్ లో.. అది బన్నీతో ఆడిపాడనుంది. ప్రస్తుతం కాజల్ చేతిలో కూడా పెద్దగా సినిమాలు కూడా లేవు. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమా చేస్తోంది. ఎలాగూపెళ్లి కూడా అయిపొయింది కాబట్టి.. గతంలో లాగా సినిమాలు చేయాలనీ ఉద్దేశ్యం కూడా ఆమెకు లేదు అట.

అయినా పుష్ప సినిమాలో మరో ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ లోనే బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలాను తీసుకున్నారు. ఇప్పటికే ఆమెతో ఆ సాంగ్ ను షూట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు కాజల్ సాంగ్ తో కలిపి.. పుష్ప సినిమాలో రెండు ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. పైగా దేవి మ్యూజిక్.. ఐటమ్ సాంగ్ లను ఆదరగోట్టేస్తాడు. ఈ లెక్కన పుష్ప ఐటమ్స్ కి ఫేమస్ అయిపోతుందేమో. మరి ఈ ఐటెమ్ సాంగ్ హిట్ అయితే కాజల్ క్రేజ్ కూడా మళ్ళీ గాడిలో పడ్డట్టే.

Back to top button