టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Kajal Aggarwal and Anushka : అనుష్క ఒప్పుకోకపోవడం కాజల్ కి కలిసొచ్చింది !

కాజల్ కి మరో బంపర్ ఆఫర్ తగిలింది. హీరోలతో స్నేహంగా ఉండటమే తన సక్సెస్ సీక్రెట్ అంటూ ఆ మధ్య కాజల్ నే స్వయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆ స్నేహమే కాజల్ ను మళ్ళీ ఫామ్ లోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. పైగా నటిగా కూడా కాజల్ మరో మెట్టు ఎదిగిందని అంటున్నారు.

Kajal Aggarwal‘కాజల్ అగర్వాల్’ ( Kajal Aggarwal) లోని మంచి తనం ఆమెకు పర్సనల్ గానే కాదు, ప్రొఫెషనల్ గానూ బాగా కలిసి వస్తోంది. పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి స్టార్ హీరోలు వెనుకాడడం లేదు. తాజాగా కాజల్ కి మరో బంపర్ ఆఫర్ తగిలింది. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం వెనుక ఉన్న రీజన్.. కాజల్ తో విజయ్ కు ఉన్న స్నేహమే.

హీరోలతో స్నేహంగా ఉండటమే తన సక్సెస్ సీక్రెట్ అంటూ ఆ మధ్య కాజల్ నే స్వయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆ స్నేహమే కాజల్ ను మళ్ళీ ఫామ్ లోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా పెళ్ళికి ముందు ఉన్న క్రేజ్‌ కంటే, కాజల్ కి పెళ్లి తర్వాత క్రేజ్ రెట్టింపు అయింది. పైగా నటిగా కూడా కాజల్ మరో మెట్టు ఎదిగిందని అంటున్నారు.

మెగాస్టార్ ఆచార్య సినిమాలో కాజల్ అంత గొప్పగా నటించిందట. చక్కని అభినయంతో విలేఖరి పాత్రలో జీవించిందట కాజల్. అలాగే, ప్రస్తుతం చేస్తోన్న ఓ వెబ్ సిరీస్ లో కూడా కాజల్ నటన గురించి గొప్ప ఫీడ్ బ్యాక్ వచ్చింది. పెళ్లి తర్వాత కాజల్ లో పరిణితి పెరిగినట్టు ఉంది. ఎలాంటి క్లిష్టమైన పాత్రలోనైనా ఒదిగిపోతూ చక్కగా అభినయిస్తోందట.

మరోపక్క కాజల్ కూడా తన నటనకు మరింత పదును పెడుతూ.. వైవిధ్యమైన చిత్రాలను ఎన్నుకుంటూ ముందుకు పోతుంది. అందుకే, నిర్మాతలు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఇప్పుడు కాజల్ తో నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అనుష్క(Anushka) తో ప్లాన్ చేసిన సినిమాలు అన్నీ, కాజల్ ఎకౌంట్ లోకి వచ్చి పడుతున్నాయి. అనుష్క కొత్త సినిమాలు ఒప్పుకోకపోవడం కాజల్ కి బాగా కలిసొచ్చింది.

కాగా తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ కాజల్ తో ఓ వెబ్‌ సిరీస్‌ చేయడానికి ప్లాన్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ను అనుష్కతో చేయాలనుకుంటే.. ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే కాజల్ తో ముందుకు పోతున్నారు మేకర్స్. కాజల్ అభిమానులకు మాత్రం మంచి కిక్ ను ఇస్తోంది ఈ న్యూస్.

Back to top button