అత్యంత ప్రజాదరణతెలంగాణరాజకీయాలు

కాళేశ్వరం మరో అద్భుతాన్ని సాధించింది..

Kaleshwaram has achieved another miracle.

తెలంగాణ కలల ప్రాజెక్టు మరో గొప్ప క్రతువును పూర్తి చేసింది. కాళేశ్వరంలోని బాహుబలి పంప్ ‘గాయత్రి’ మరో పెద్ద ఘనతను సాధించింది. ఏకంగా 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఎవరూ సాధించని ఫీట్ ను సాధించింది.

కాళేశ్వరం సంకల్పం తెలంగాణ  దశనే మార్చేసింది.  ఇప్పుడు కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను  అన్ని జిల్లాలు సంతరించుకున్నాయి. తెలంగాణ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశంలో క్లిష్టమైన కష్టమైన ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.. ప్రపంచ ప్రఖ్యాత మేఘా ఇంజనీరింగ్ దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తెలంగాణ వ్యాప్తంగా సాగు, తాగునీరు అందించేలా తీర్చిదిద్దుతోంది. ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఇప్పుడు ప్రజలకు నీరు కూడా అందుతోంది.

ఓ మొక్కకు అంటుకట్టినట్టు.. ఓ గోడ కట్టినట్టు.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ముందుకెళ్లారు. అదే ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. పంటను పండించింది. దానికి ఎంతో ఖర్చు అయ్యింది. ఆ ఖర్చు విమర్శకులు దుమ్మెత్తి పోశారు కూడా. అయితేనేమీ.. రైతు పండింది. అతడు బతుకు మెరుగైందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలంగాణ మణిహారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అనతి కాలంలోనే లింక్-1, లింక్-2 నుండి 100 టిఎంసీల ఎత్తపోసి రికార్డు సృష్టించింది. 100 టిఎంసీల నీటిని ఎత్తిపోసిన లింక్-1 పంప్ హౌస్ లు చరిత్ర సృష్టించింది.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ  లింక్-2లో గాయత్రి పంప్ హౌస్ లో కాళేశ్వరంలో మొదటి పంప్ హౌస్  జూన్ 21-2019 లో ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర రావు మేడిగడ్డ పంప్ హౌస్ ను ప్రారంభించారు.

 ఆగష్టు 11, 2019లో గాయత్రి పంప్ హౌస్ ను ప్రారంభించిన మేఘా అత్యధికంగా 1703 గంటలు నీటిని పంపింగ్ చేసి కొత్త రికార్డ్ నెలకొల్పింది.  ఇక మొదటి మిషన్ నుండి 1367 గంటల పాటు ఎత్తిపోసింది. ఒక్కొక్క పంప్ హౌస్ నుండి 3150 క్యుసెక్కుల నీటి విడుదల చేసింది. 111.4 మీటర్ల ఎత్తుకు 100 టిఎంసీల నీటిని పంప్ చేసిన గాయ్రతి పంప్ హౌస్ తెలంగాణ నీటి యజ్ఞంలో సువర్ణ అక్షరాలను లిఖించింది.

Back to top button