టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఏమిటో ‘కళ్యాణ్ రామ్’ ఏ నమ్మకంతో చేస్తాడు ?

Kalyan Ram
‘నందమూరి కళ్యాణ్ రామ్’ సినిమాల సెలెక్షన్ మొదటినుండి విభిన్నంగానే సాగుతుంది. మధ్యలో ఎన్టీఆర్ సహకారంతో కొన్ని కమర్షియల్ సినిమాలు చేసి కెరీర్ పరంగా ఒకటి రెండు మంచి కమర్షియల్ సక్సెస్ లు అందుకున్నా.. కళ్యాణ్ రామ్ మాత్రం తన మార్క్ సినిమాలను వదులుకోలేకపోతున్నాడు. ఆ సినిమాలు సక్సెస్ కావు అని అనుభవ పూర్వకంగా తెలిసినా.. ఎందుకో కళ్యాణ్ రామ్ ఆ చిత్రాల పై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకూ వైవిధ్యమైన కథలతో ఎన్నో కొత్త ప్రయత్నాలు చేసాడు.

ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. పైగా తన సొంత బ్యానర్ లో.. అదీ మరో ప్రయాత్మక సినిమా.. ఏమిటో కళ్యాణ్ రామ్ ఇలాంటి సినిమాలను ఏ నమ్మకంతో చేస్తాడు అంటూ ఆయన సన్నిహితులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నా.. తన అభిరుచిని మాత్రం కళ్యాణ్ రామ్ మార్చుకోవడం లేదు. తన కెరీర్ బెస్ట్ సినిమా ఏ ‘పటాస్’ లాంటి సినిమా చేసుకోకుండా.. ఎందుకు కళ్యాణ్ రామ్ రిస్క్ చేసి మరీ విభిన్నమైన సినిమాల పేరుతో బోరింగ్ సినిమాలు చేస్తాడు ? అది కళ్యాణ్ రామ్ కే తెలియాలి.

కాగా వేణు మల్లిడి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చింది. ఈ సినిమా టైమ్ మిషన్ నేపథ్యంలో ఉంటుందట. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా చేస్తారని సమాచారం. ప్రస్తుతం కాలానికి 500 సంవత్సరాలు వెనక్కి వెళతారట. అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించడానికి భారీ సెట్స్ కూడా వేయబోతున్నారట. ఇదే నేపథ్యంలో బాలకృష్ణ ఆదిత్య 369 అంటూ అప్పట్లోనే ఓ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మరి ఇప్పుడు రానున్న కళ్యాణ్ రామ్ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.

Back to top button