బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ప్చ్.. సంచలన బ్యూటీ సీఎం అవుతుందట !

Kangana Ranaut
అవకాశాల కోసం పోర్న్ వీడియోలు చేయడానికి కూడా సిద్ధ పడింది ‘కంగనా రనౌత్’. ఆ తరువాత కాలం కలిసి వచ్చి.. వరుస అవకాశాలు అందుకుని.. మొత్తానికి ఎవ్వరూ ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఎప్పుడైతే తనకు మార్కెట్ వచ్చిందో.. ఇక అప్పటి నుండి ఎవ్వర్నీ లెక్క చేయకుండా దూసుకుపోతుంది కంగనా. ప్రస్తుతం బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా చలామణి అవుతోన్న ఈ బ్యూటీకి రాజయాలు అంటే ఇష్టం అంటుంది.

అందుకే గత కొంతకాలంగా ఆమె రాజకీయాల పై సంచలన కామెంట్స్ చేస్తున్నానని.. భవిష్యత్తులో కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తాను అని తన సన్నిహితులతో చెబుతుందట. ఏది ఏమైనా కంగనా రనౌత్ ప్రతి విషయంలో పక్కా క్లారిటీ తో ఉంటుంది. తేడా కొట్టిందా వాడు వీడు అన్న తేడా లేకుండా.. తాను టార్గెట్ చేసిన వ్యక్తి పరువు తీసేవరకు నిద్రపోదు. తన కెరీర్ ప్రారంభంలో తనను టార్చర్ పెట్టిన వాళ్ళ పరువు తీసిన ఈ బ్యూటీ పై బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా మంచి అభిమానం ఉంది.

ఇప్పుడు ఆ అభిమానాన్నే రాజకీయ పరంగా కూడా క్యాష్ చేసుకోవాలనేది కంగనా ఆలోచన. తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటించిన దగ్గర నుండి కంగనాకి సీఎం కావాలనే ఆశ ఎక్కువైందట. తనలాగే జయలలిత కూడా మొదట్లో ఒక గ్లామర్ హీరోయిన్ అని, కానీ ఆ తరువాత ఆమె తన వ్యక్తితత్వంతో సీఎం అయిందని.. తానూ అలాగే అవ్వాలని కంగనా కలలు కంటుంది. అందుకే రాజకీయ పరంగా ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అన్ని విషయాల పై డైరెక్ట్ గా మీడియా ముందే సంచలన కామెంట్స్ చేస్తోంది ఈ భామ.

ఇక కంగనాను చాలా పార్టీలు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాయట. అన్నట్టు కంగనా తన రాజకీయాల పై మాట్లాడుతూ.. ‘మా తాత సర్జు సింగ్ రాజపుత్ హిమాచల్ ప్రదేశ్ లో పొలిటీషియన్ గా పనిచేసారు. బహుశా ఆయన వారసత్వమే నాకు వచ్చిందేమో. నాకైతే ఒక పార్టీ తరపున ప్రచారం చేయాలన్న ఆలోచన లేదు, ఎందుకంటే అలా చేస్తే అన్ని వైపులా మాట్లాడే స్వేచ్ఛను నేను కోల్పోతాను అంటూ చెప్పుకొచ్చింది. కంగనా అయితే ప్రస్తుతం, బిజెపి వైపు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Back to top button