తెలంగాణరాజకీయాలు

పాత ఫార్ములా పైనే కేసీఆర్‌‌ ఫోకస్‌ : ఆ రెండు పార్టీలకు చెక్‌

KCR
తెలంగాణలో ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌కు అంత సానుకూల పవనాలు ఏమీ లేవు. రోజురోజుకూ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దెబ్బతింది. దుబ్బాకలో ఓడిపోయిన పార్టీ.. జీహెచ్‌ఎంసీలో చావు తప్పి కన్ను లొట్ట పడ్డంత పని అయింది. దీంతో ఇప్పుడు కేసీఆర్‌‌ తన ఆలోచనలను మార్చుకున్నారట. ఇందుకు నాగార్జన సాగర్‌‌ ఉప ఎన్నికను టార్గెట్‌ చేశారట.

Also Read: ఆ నిర్ణయం జగన్‌కే మంచి చేసిందా..?

ఈ బై పోల్‌లో ఎలాగైనా గెలిచి కాంగ్రెస్‌ను, దూకుడు మీద ఉన్న బీజేపీలకు చెక్ పెట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అభ్యర్థి ఎవరైనా తనను చూసి ఓటెయ్యమని ఆయన అడుగుతుండటాన్ని బట్టి చూస్తే అభ్యర్థిని ఇక్కడ డమ్మీ చేశారు. జానారెడ్డి ఇక్కడ గెలిచినా మరో మూడేళ్లు ఉపయోగం ఉండదని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. అంతేకాదు తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఓటు వేయవద్దని కూడా ప్రజలకు కేసీఆర్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఉప ఎన్నిక అటు కేసీఆర్‌‌కు, ఇటు టీఆర్‌‌ఎస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం.

తన ఏడేళ్ల పాలనలో ప్రజలు తన వైపు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ ఉప ఎన్నిక కేసీఆర్‌‌కు సవాల్‌గా మారనుంది. ఇటు విపక్షాలతోపాటు సొంత పార్టీలో తలెగరేస్తున్న నేతల నోళ్లను కూడా మూయించవచ్చు. అందుకే కేసీఆర్ స్వయంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి ముందుగా వచ్చారు. దీంతోపాటు కేసీఆర్ నల్లగొండ జిల్లాపై వరాల వర్షం కురిపించారు. ప్రతీ గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ప్రతీ మండల కేంద్రానికి 30 లక్షలు ఇస్తామన్నారు. నల్లగొండ జిల్లాలోని ప్రతీ మున్సిపాలిటీకి కోటి రూపాయలు ఇస్తామని, ప్రత్యేకంగా మిర్యాలగూడ మున్సిపాలిటికీ ఐదు కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లికల్లు–జింకలపాలెం భూవివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పారు.

Also Read: చైనా సైన్యానికి ధీటుగా బదులిచ్చిన భారత బెబ్బులి ఎవరో తెలుసా?

కానీ.. కేసీఆర్‌‌ హామీలన్నీ కూడా హుజూర్‌‌నగర్‌‌ ఫార్ములా అని ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ ఎటువంటి హామీలు ఇవ్వలేదు. అక్కడ పర్యటించలేదు. అందుకే అక్కడ ఓడిపోయామని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. హుజూర్‌‌నగర్‌‌లో తన నభ తర్వాత ఓటింగ్ అనుకూలంగా మారిందంటున్నారు. అందుకే.. నాగార్జున సాగర్ విషయంలోనూ హుజూర్‌‌నగర్ ఫార్ములాను అమలు చేయడానికే కేసీఆర్ రెడీ అయ్యారంటున్నారు. మరి కేసీఆర్‌‌ ఎత్తులు ఈ ఉప ఎన్నికలో ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button