తెలంగాణప్రత్యేకంరాజకీయాలు

కేసీఆర్ గ్రేట్ అబ్బా.. మోడీకే సలహాలు ఇస్తున్నాడు..

KCR giving advice to Modi

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం మొత్తం అల్లకల్లోలమవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సలహాలు, సమీక్షలతో కాలం గడుపుతుందీ తప్ప ఎటువంటి ప్రజాయోపకరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకుంటూ తమ రాష్ట్రాలకు అవసరమైన సేవలను సమకూర్చుకుంటున్నాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మిగతా వారి కంటే భిన్నంగా ఉన్నారు. ముఖ్యంగా లాక్డౌన్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ‘లాక్డౌన్ వేస్ట్’ అంటూ భారీ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాని మోడికి కొన్ని సలహాలు ఇచ్చి అందరి చేత ప్రశంసలు కురిపించుకుంటున్నారని తెలంగాణ సీఎంవో ప్రకటించడం విశేషం.

దేశంలో దాదాపు తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు స్వల్ప, పూర్తిస్థాయి లక్డౌన్లు ప్రకటించేశాయి. తెలంగాణ లో మాత్రం నైట్ కర్ఫ్యూతో మాత్రమే ముందుకు సాగుతున్నారు. దీంతో కరోనా కేసులు విచ్చల విడిగా పెరుగుతున్నాయి. అయితే లాక్డౌన్ పెట్టిన రాష్ట్రాల్లో కేసులు తగ్గాయా..? అంటూ కేసీఆర్ కౌంటర్ ఇవ్వడం విశేషం. దీంతో ప్రధాని చెప్పింది తూ.చ. తప్పకుండా పాటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆక్సిజన్ కోసం ఆంధప్రదేశ్ లాంటి రాష్ట్రాలో సొంతంగా ప్లాంట్లను సమకూర్చుకుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడుతోంది.

ఇదిలా ఉండగా ఇటీవల ప్రధాన మంత్రి మోడీ ముఖ్యమంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో మోదీకి కేసీఆర్ కొన్ని సూచనలు చేశారట. అలా చేస్తే వైరస్ నుంచి త్వరగా కోలుకోవచ్చని చెప్పారట. దీంతో ఈ సలహాలు మోదీకి బాగా నచ్చాయని కేంద్ర మంత్రుల్లో ఒకరు చెప్పారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

లాక్డౌన్ గానీ.. ఆక్సిజన్ గానీ రాష్ట్రాలు ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రధాని మోదీ బాటలో వెళ్తూ సమీక్షలకే పరిమితం అవుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానికే కేసీఆర్ సలహాలు ఇచ్చే బదులు రాష్ట్రంలో అమలు పర్చొచ్చుగా..అని కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Back to top button