అత్యంత ప్రజాదరణతెలంగాణరాజకీయాలు

ఆ దెబ్బకు కేసీఆర్ మార్చేస్తున్నారే?

KCR

దాదాపు రెండేళ్లుగా తెలంగాణలో పాలన స్తబ్దుగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా కల్లోంతో కేసీఆర్ సర్కార్ గత ఏడాది 2020 మొత్తం ఏం చేయకుండా కరోనా కేసులు లెక్కపెట్టుకుంటూ కూర్చుండిపోయింది. అంతకుముందు ఏడాది 2019 కూడా మంత్రివర్గ విస్తరణ చేయకుండా సగం ఏడాదికిపైగా కాలం గడిపిన కేసీఆర్ ప్రజలకు ఏం చేయలేకపోయాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు.

Also Read: వీళ్లకే తొలి టీకాలు.. ధర ఎంతంటే?

ఇక గత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దారుణ పరాభవంతో కేసీఆర్ సార్ కు జ్ఞానోదయమైంది. దీంతో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ధరణి , ఎల్ఆర్ఎస్ వంటి వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ధరణి పోర్టల్ లోనూ ఇబ్బందులు తొలగించే పనిలో పడ్డారు.

ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాట్లు కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. పోర్టల్లో అవసరమైన మార్పు చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు.

Also Read: సంక్రాంతి జర్నీ భారం.. ‘ప్రైవేటు’ బాదుడుతో పండుగ కష్టాలు

భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం.. కొత్త పాసు పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత వస్తోందని.. దస్త్రాల నిర్వహణ, క్రయవిక్రయాలు పారదర్శకంగా అవినీతి రహితంగా జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ధరణి వందశాతం విజయవంతమైందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక ఫిబ్రవరి 1 నుంచి చదువులను పట్టాలెక్కిస్తున్నారు. పెండింగ్ సమస్యలను తీర్చేస్తున్నారు. కాగల కార్యాలపై దృష్టిసారించి ప్రజా ఉపయోగ నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button