తెలంగాణరాజకీయాలు

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం?


తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఎవరైనా గీతదాటారో వేటు తప్పదన్నట్లుగా కరోనా విజృంభిస్తోంది. గడిచిన మూడురోజులుగా కరోనా కేసులు తెలంగాణలో వెయ్యికిపైగా నమోదవుతోన్నాయి. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతోన్నారు. ఒకవైపు ప్రభుత్వం కరోనా కట్టడికి సర్వశక్తులు ఒడ్డుతున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ఫలితాలు రావడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడమేకానీ తగ్గిన దాఖలాలు కన్పించడం లేదు.

మోడీ స్పీచ్ అసదుద్దీన్ కి ఇలా అర్థమైందా?

శుక్రవారం ఒక్కరోజు తెలంగాణ రికార్డు స్థాయిలో 1,892కేసులు నమోదయ్యాయి. దీనిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని 1,658 కేసులు నమోదకావడం గమనార్హం. మిగతా జిలాల్లన్ని కలుపుకొని 234పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,462కు చేరింది. ఇప్పటివరకు కరోనా 283మంది మృతిచెందినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్ర హోంమంత్రికి సైతం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐదురోజుల చికిత్స అనంతరం ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ కూడా కరోనా సెగ తాకింది. దీంతో ప్రభుత్వం యంత్రాంగం అలర్టయి తగు చర్యలు చేపడుతోంది.

లాక్డౌన్లో భాగంగా ప్రభుత్వం రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లను ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టింది. దీంతో కరోనా కొంతమేర కట్టడిలో ఉండేది. ప్రభుత్వం ఎప్పుడైతే ఆదాయం కోసం సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టితే నాటి నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఒకప్పుడు పదులు, వందల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. గడిచిన మూడురోజులుగా వెయ్యికి తగ్గకుండా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం చేతులేత్తినట్లుగా కన్పిస్తోంది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండటంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవుడా: అటు ప్రభుత్వం చేయదు.. ఇటు ప్రైవేటు దోపిడీ

కరోనా విషయంలో సీఎం కేసీఆర్ గతంలో చూపించనంత శ్రద్ధ ప్రస్తుతం చూపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో కేసీఆర్ కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో కలెక్టర్లే ఆయా జిల్లాల్లో కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్లే స్వయంగా రంగంలోకి దిగడం ప్రభుత్వాధికారులు చిత్తశుద్ధితో పని చేశారు. దీంతో కరోనాను కట్టడిలోకి వచ్చింది. కొన్ని జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారాయి. వీరి పనితనాన్ని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రశంసించారు. ఆ తర్వాత లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కలెక్టర్లంతా వారివారీ పనుల్లో బీజీగా మారిపోయారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తిరిగి వారిని రంగంలోకి దింపాలని కేసీఆర్ ఆశిస్తున్నారట. ఐఏఎస్ లు కరోనా కట్టడికి చర్యలు చేపడితే కంట్రోల్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. ఈమేరకు ఐఏఎస్ లంతా బృందంగా ఏర్పడి పని చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్లంతా రంగంలోకి దిగితే పరిస్థితిలో కొంచెం మార్పురావడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కంట్రోల్లో ఉందని ప్రభుత్వం చెబుతోంది. కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న ఆ స్థాయిలో మరణాల్లేవని చెబుతోంది. ఏదిఏమైనా కలెక్టర్లు రంగంలోకి దిగడం శుభపరిణామమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం వేలల్లో నమోదవుతున్న కేసులు సంఖ్యను ఐఏఎస్ ల బృందం ఏమేరకు కట్టడి చేస్తుందో వేచి చూడాల్సిందే..!

Tags
Show More
Back to top button
Close
Close