అత్యంత ప్రజాదరణజాతీయంరాజకీయాలు

మళ్లీ కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. వర్కవుట్ అవుతాయా?

KCR Modi

తెలంగాణ రాష్ట్రం సాధించడం కష్టం అని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ పట్టుదలతో దాన్ని సాధించారు. ఇప్పుడు గులాబీ శ్రేణులు కేసీఆర్ ను ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారట.. తెలంగాణపై బీజేపీ దండయాత్ర నేపథ్యంలో కేసీఆర్ రూటు మార్చి జాతీయ స్థాయిలో బీజేపీకి యాంటీగా రాజకీయాలు మొదలు పెట్టాలని యోచిస్తున్నారట.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ గులాబీ బాస్ మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.. బీజేపీ వంచన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బీజేపీపై యుద్ధం ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది..

Also Read: చంద్రబాబుకు ఓవైసీతో దోస్త్ కలిసివస్తుందా.?

తాజాగా దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడడం.. బీజేపీ గెలవడం.. తెలంగాణపై బీజేపీ నజర్ ఎక్కువ కావడంతో ఇక బీజేపీని ఢీకొట్టడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. దేశానికి కొత్త దిశ, దశ చూపించాల్సిన టైం వచ్చిదంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కొత్త రాజకీయాలకు తానే ఆవిష్కర్తను అవుతానంటూ కేసీఆర్ ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అట్టర్ ఫ్లాప్ అని కేసీఆర్ టార్గెట్ చేశారు.

జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ డిసెంబర్ రెండో వారం తర్వాత ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళతారనే ప్రచారం సాగింది. కేసీఆర్ ప్రధాని అవుతారని.. కేటీఆర్ సీఎం అవుతారని అందరూ భావించారు. ఇప్పుడు ఆ ప్రచారం మళ్లీ మొదలైంది.

Also Read: గ్రేటర్ ఎన్నికలు.. విడిపోయిన సినిమా వాళ్లు..

2019 సార్వత్రిక ఎన్నికల్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి మెజార్టీ తగ్గితే తనకున్న పరిచయాలు, బలంతో కేంద్రంలో పాగావేయాలని.. జాతీయ రాజకీయాలను శాసించాలని ప్లాన్ చేశారు. కానీ బ్యాడ్ లక్. కేంద్రంలో బీజేపీకి క్లియర్ కట్ మెజార్టీ రావడంతో కేసీఆర్ ఆశలు అడియాశలయ్యాయి. మరి ఇప్పుడు మరోసారి జాతీయ రాజకీయాలపై వెళుతున్న కేసీఆర్ ఏం చేయనున్నారన్నది వేచిచూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button