తెలంగాణరాజకీయాలు

కేంద్రంతో యుద్ధానికి సిద్ధమవుతున్న కేసీఆర్?

విద్యుత్ చట్టంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం..

కొత్త విద్యుత్ చట్టంను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ కేంద్రంతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు గా తెలుస్తోంది. ఈ మేరకు కేసీఆర్ ఈ విద్యుత్ చట్టంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కేంద్రంపై ఫైట్ కే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: నమో మోడీ.. వెన్నుచూపని భారతీయుడు

ఇప్పటికే తెలంగాణలో రైతులందరికీ ఉచిత విద్యుత్ అందుతోంది. ఈ కొత్త చట్టంతో వారికి నేరుగా సర్కార్ డబ్బులు చెల్లించాలి. ఇదే కేసీఆర్ కు తలకుమించిన భారం. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు రికార్డ్ చేయకుండా తోచినంత వేస్తే సామాన్యుల నుంచి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వరకూ మొత్తుకున్నారు. ఇప్పుడు మీటర్లు పెట్టి కేంద్రం లెక్కిస్తే జనాలు, రైతుల గుండెలు గుభేల్ మనడం ఖాయం.

రాష్ట్రాలకు విద్యుత్ వ్యవస్థపై నియంత్రణ ఉండదని.. ప్రజలకు ఇక్కట్లు వస్తాయని.. విద్యుత్ సంస్థల్లో వేల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన కొత్త చట్టంతో అందరిలోనూ నెలకొంది.  కేంద్రం చట్టం వల్ల తెలంగాణలో 26 లక్షల బోర్లకు మీటర్లు పెట్టాలి. వీటికి కనీసం 700 కోట్లు కావాలి. రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తారు. దీంతో పాత రోజులు మళ్లీ వస్తాయి. బిల్ కలెక్టర్ వస్తున్నాడంటే రైతుల గుండెలు ఆగిపోయే పరిస్థితి వస్తుందని కేసీఆర్ అంటున్నారు.

ఈ చట్టం వస్తే ఢిల్లీలోనే లోడ్ సెంటర్లు ఉంటాయని.. ఇది విద్యుత్ సంస్థల ఉసురు తీయడమేనన్నారు. కొత్త చట్టంలో విద్యుత్ 20శాతం ఉండాలని పెట్టిన నిబంధన రాష్ట్రాలకు తీవ్ర ఎదురుదెబ్బగా కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో రాష్ట్రాలు కేంద్రం వద్ద తప్పనిసరిగా విద్యుత్ కొనాల్సి ఉంటుందని కేసీఆర్ విమర్శించారు.

Also Read: హైదరాబాద్ ఖ్యాతి.. మరోసారి ఇనుమడించింది

కేంద్రం తెస్తున్న కొత్త విద్యుత్ చట్టం అతిభయంకరమైనదని.. అనేక లోపాలున్నాయని.. రాష్ట్రాల హక్కులను హరించేదిగా కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాసే ఈ చట్టం సమాఖ్యా స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని.. పలు రాష్ట్రాల సీఎంలు తనతో మాట్లాడారని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పుకొచ్చాడు.

పార్లమెంట్ లో ఈ కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకించి అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి దీనిని జాతీయ స్థాయి ఉద్యమంగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఏం చేయకున్నా మంచిదేనని.. రాష్ట్రాలకు శఠగోపం పెట్టకుంటే చాలని కేసీఆర్ అంటున్నారు.

Back to top button