తెలంగాణరాజకీయాలు

వైఎస్ షర్మిలకు షాకిచ్చిన కేసీఆర్

KCR shocked to YS Sharmila

ఎంతో ఉత్సాహం.. ఉల్లాసంగా.. తెలంగాణలో సమరశంఖం పూరించాలని చూస్తున్న వైఎస్ షర్మిలకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. ఇప్పటికే ఖమ్మం సభకు వైఎస్ షర్మిల అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఏప్రిల్ రెండో వారంలో సభ పెట్టి పేరు, పార్టీ జెండా అనౌన్స్ కు రంగం సిద్ధం చేశారు.

ఈ సభకు ఏపీ నుంచి వైసీపీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలించేందుకు రెడీ అయ్యారట.. అయితే ఖమ్మం సభకు అన్నీ సిద్ధం చేసుకున్న వేళ కేసీఆర్ సర్కార్ షర్మిలకు గట్టి షాక్ ఇచ్చింది. షర్మిల సభకు అనుమతులు రద్దు చేస్తున్నట్టు తెలిపి కోలుకోలేని దెబ్బ తీసింది.

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత భారీగా పెరగడం.. మరణాలు సంభవించడంతో సర్కార్ అప్రమత్తమైంది. లాక్ డౌన్ పెట్టే ఆలోచనలేకున్నా సభలు, సమావేశాలు, థియేటర్స్ కు కఠిన నిబంధనలు సూచించింది. తాజాగా భారీగా జనాలు సమూహంగా ఏర్పడే సభలకు అనుమతులు ఇవ్వరాదని నిర్ధేశించింది. ఇటీవల వకీల్ సాబ్ స్టేడియంలో సభకు నిరాకరించింది.

ఈ క్రమంలోనే కరోనా తీవ్రత దృష్ట్యా వైఎస్ షర్మిల సభకు అనుమతులు రద్దు చేస్తున్నట్టు జీవో 68, 69 ప్రకారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీవో 68, 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్ చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు.

తెలంగాణలో పార్టీ స్థాపించాలని వడివడిగా ముందుకెళుతున్న వైఎస్ షర్మిలకు ఈ పరిణామం షాకింగ్ గా మారింది. ఈనెల 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు రెడీ అయిన వేళ ఇప్పుడా సభ నిర్వహణపై కరోనా దెబ్బ పడింది. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో సభకు షర్మిల బృందం ఇటీవల పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. ఇంతలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో పోలీసు శాఖ అనుమతి రద్దు చేయడం షర్మిలకు షాకింగ్ మారింది.

Back to top button