అత్యంత ప్రజాదరణతెలంగాణరాజకీయాలుసంపాదకీయం

కేసీఆర్ కు చిన్నప్పుడే పెళ్లి అయిందని తెలుసా? అయితే అది నిజమా..? కాదా..?

KCR Story on marriage and political life

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చావునోట్లో తలపెట్టి వచ్చిన ఈయన ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 2001 నుంచి పదేళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేశాడు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర పితామహుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే కేసీఆర్ కు చిన్నప్పుడే పెళ్లి అయిందని తెలుసు. అయితే అది నిజమా..? కాదా..? అన్న సందేహం కొందరిలో కలుగుతోంది. రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ పెళ్లి నాటి ఫొటో సోషల్ మీడియాలో పెట్టారు. దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చింతమడక గ్రామంలో కేసీఆర్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాఘవరావు, వెంకటమ్మ. చిన్నప్పటి నుంచి కేసీఆర్ కు చదువుపై శ్రద్ధ ఉండేది. తెలుగు సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టమైన కేసీఆర్ ఆ టీచర్ కు ప్రియ శిష్యుడిగా మారారు. 1969లో కేసీఆర్ 10వ తరగతి పూర్తి చేశారు. ఈ సమయంలోనే కేసీఆర్ శోభను పెళ్లి చేసుకున్నారు. శోభ తండ్రి కె. కేశవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. ఈయన ప్రభావం కేసీఆర్ పై పడిందని అంటుంటారు.

ఇక కేసీఆర్ చదువుతో పాటు తన అన్నలకు సాయంగా వ్యవసాయం పనులు చేసేవాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఆయన రాజకీయాలపై అవగాహన పెంచుకున్నాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. డిగ్రీ పూర్తి చేసిన ఆయన తెలుగులోనే పీజీ చేశాడు. ఈ పీజీ ఉస్మానియాలో చేయడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఇక్కడే నాంది పడిందని చెప్పుకుంటారు.

కేసీఆర్ బ్యాక్ రౌండ్ భూస్వామి కుటుంబం అయినందువల్ల ఆయనకు డబ్బు కొరత ఉండేది కాదు. దీంతో ఆయన చదువుపైనే దృష్టి పెట్టారు. ఇక పీజీ చేస్తుండగా కేటీఆర్ పుట్టారు. కేసీఆర్ ఎన్టీరామారావుకు వీరాభిమాని. అయితే టీడీపీలో జాయిన్ అయ్యాక కేటీఆర్ పేరు పెట్టారని అంటారు. కానీ టీడీపీలో జాయిన్ అయ్యే ఆరేళ్ల ముందుగానే కేటీఆర్ పుట్టాడు. ఏడాది తరువాత కవిత పుట్టారు.

1976లో యువజన కాంగ్రెస్ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో కేసీఆర్ కాంగ్రెస్ లో చేరారు. 1983లో ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరాడు. టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన ప్రత్యర్తి మదన్ మోహన్ చేతిలో ఓడిపోయారు. దీంతో నిరాశ చెందిన కేసీఆర్ సిద్ధిపేటలోని ఏ ఒక్క గ్రామాన్ని వదలకుండా ఊరురా తిరుగుతూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. దీంతో ఆయన వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినేట్ లో కరువు మంత్రిగా, బాబు కేబినేట్ లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

అయితే చంద్రబాబు కేసీఆర్ కు మరోసారి మంత్రి పదవి ఇవ్వకుడా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంతో రాజకీయం మారిపోయింది. 2001లో చంద్రబాబుపై తిరుగుబావుట ఎగువేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ వాదాన్ని నమ్ముకొన్న కేసీఆర్ సిద్ధిపేటకు రాజీనామా చేసి ఆ తరువాత మళ్లీ గెలుపొందారు. ఎవరెన్నీ చెప్పినా నమ్మని కేసీఆర్ తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు. అలా చేర్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

Back to top button