గెస్ట్ కాలమ్తెలంగాణరాజకీయాలు

గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?


పాత ఒక రోత.. కొత్త ఒక వింత అన్న సామెతను అక్షరాల అమలు చేసేందుకు గులాబీ దళపతి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ లోని సీనియర్లకు ఇక పదవులు ఇవ్వరాదని.. యువతను పార్టీలో ప్రోత్సహించాలని యోచిస్తున్నారట.. గులాబీపార్టీకి కాబోయే అధిపతి కేటీఆర్ కు రెడ్ కార్పొట్ పరిచేందుకే ఇలా చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ లో సీనియర్లు.. ఆది నుంచి పార్టీని పట్టుకొని ఉన్న నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి సహా ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఉన్న జోగు రామన్న,మహేందర్ రెడ్డి తదితర పాత నేతలకు ఇక పదువులు ఇచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాత నేతలకు మంగళం పాడిన కేసీఆర్ కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. పువ్వాడ అజయ్,మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి,మల్లారెడ్డి లాంటి కొత్త నేతలను మంత్రులను చేసి ఆశ్చర్యపరిచాడు.

అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!

రెండోసారి ప్రజలు పూర్తి మెజార్టీ ఇవ్వడంతో కేసీఆర్ ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ సమాజం భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల చనిపోయిన కర్నల్ సంతోష్ కుటుంబానికి 5 కోట్లు ఇచ్చి ఇలా అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక తన మాట వినని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆదరించిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా నాన్చివేతతో వ్యవహరించి చివర్లో ట్విస్ట్ తో హీరోగా మిగిలిపోతున్నారు.

తెలంగాణలో అధికారంపై ఆశలు పెంచుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు కొరకరాని కొయ్యగా మారిపోతున్నారు. రెండోసారి గద్దెనెక్కిన కేసీఆర్ లో ఈ స్పష్టమైన మార్పు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

ఈ క్రమంలోనే తన కుమారుడు కేటీఆర్ కు రంగం సిద్ధం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాత తరం నేతలకు ఎమ్మెల్సీలు సహా రాజ్యసభ విషయంలో నమ్మిన వారికే పదవులు ఇవ్వడం.. యువతను ప్రోత్సహించి కేటీఆర్ వర్గాన్ని తయారు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లను పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు టీఆర్ఎస్ కు ఈ మధ్య వస్తున్నాయట.. చాలా మంది పాత సీనియర్లు టీఆర్ఎస్ అధిష్టానం తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నారు. కానీ ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు. దీంతో గులాబీ తోట కొత్త పుష్పాలకే ఇక ప్రాధాన్యం దక్కబోతోందని ఆ పార్టీలో చర్చ మొదలైంది.

-నరేశ్ ఎన్నం