సినిమా

ఫస్ట్ లుక్: పల్లెటూరి పిల్లగా కీర్తి.. ‘గుడ్ లక్ సఖీ’

Keerthy Suresh as a village girl in Good Luck Sakhi

మహానటితో బంపర్ హిట్ తోపాటు మంచి నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ కు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు, హిట్స్ రాలేదు. అయినా కూడా ఈ మధ్య కరోనా కు ముందు ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. రంగ్ దే, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాల్లో ఆమె నటిస్తోంది.

Also Read: వకీల్ సాబ్ షూటింగ్ డేట్ ఫిక్స్ !

తాజాగా కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తికి బర్త్ డే విషెస్ చెప్పిన తన లేటెస్ట్ మూవీ ‘సర్కార్ వారి పాట’ మూవీలోనూ కీర్తి నటిస్తోందని ప్రకటించారు. ఈ మేరకు బర్త్ డే విషెస్ ను సర్కార్ వారి పాట టీం తెలుపడంతో ఇది ఖాయమైంది.

కీర్తి నటించిన రెండు సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ కాగా.. తాజాగా ‘మిస్ ఇండియా’ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది.

Also Read: దిగ్గజ అగ్ర హీరో కొడుకుపై రేప్ కేసు

తాజాగా గుడ్ లక్ సఖీ సినిమా నుంచి కీర్తి సురేష్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ అయ్యింది. కీర్తి బర్త్ డే సందర్భంగా ఆమె లుక్ ను ఇందులో రివీల్ చేశారు. ఇందులో అచ్చం పల్లెటూరి పిల్లలా కీర్తి నటన హావభావాలు ఆకట్టుకున్నాయి. నగేష్ కుకునూరు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Back to top button