తెలంగాణరాజకీయాలు

కిషన్ రెడ్డిపై సోషల్ మీడియా వార్!

రెండు తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రి పదవి పొందిన ఏకైన నేతగా పేరొందిన జి కిషన్ రెడ్డి తెలంగాణాలో తోటి బిజెపి ఎంపీల పై దాడులు జరుగుతున్నా, బైంసాలో హిందువులపై మునిసిపల్ ఎన్నికల సందర్భంగా దారుణమైన దాడి జరిగినా స్పందించక పోవడం పట్ల బిజెపి వర్గాలలోని తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఆయన మంత్రి పదవికి అనర్హుడివి అంటూ సోషల్ మీడియా లో వైరల్ వలే ఒక పోస్టింగ్ వ్యాపిస్తుంది.

హిందువులపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నావ్ అంటూ నిలదీస్తున్నారు. కనీసం అక్కడకు వెళ్లి, బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పవలసింది పోయి; హోమ్ మంత్రిగా ఇటువంటి దాడుల సమయంలో తెలంగాణ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే కేంద్రం సహింపబోదని హెచ్చరించ వలసింది పోయి ప్రేక్షక పాత్ర వహించడం ఆగ్రహం కలిగిస్తున్నది.

బైంసా హిందువుల ఇండ్లు తగలబేట్టి ఇంట్లో వున్న వస్తువులు లూటీ చేసి హిందువులపై ముస్లింలు దాడులు చేస్తే ఇప్పటి వరకు భాదితులను పరామర్శించని నీకు మంత్రి పదవి అవసరమా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా మౌనం వహిస్తుండటం సహితం విమర్శలకు దారి తీస్తున్నది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులపై రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే, మతపరమైన ద్వేషాలను సృష్టించి ఎంఐఎం కార్యకర్తలనూ రెచ్చగొట్టి హిందువులపై దాడులు చేస్తుంటే మీరేమి చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

చివరకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ , మొన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై ఎంఐఎం గుండాలు, టిఆర్ఎస్ గుండాలు దాడులు చేస్తే ఒక్కమాటకూడా మాట్లాడక పోవడం పట్ల బిజెపి వర్గాలు విస్మయం చెందుతున్నాయి.

రాష్ట్ర పోలీసులు హిందూ సంస్థల, బీజేపీ కార్యకర్తల పైన, ఆఖరికి ఎంపీల పైనా, మహిళ కార్యకర్తల పైన పాశవికంగా దాడులు చేస్తుంటే.. దేశానికి హోంమంత్రిగా కనీసం స్పందించారు అంటూ ప్రశంలు కురిపిస్తున్నారు.

By నరేంద్ర చలసాని

Back to top button