ఆరోగ్యం/జీవనం

కివీ పండ్లు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

Kiwi Benefits

పండ్లు తినడం ద్వారా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇతర పండ్లతో పోలిస్తే కివీ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. కివీ పండ్ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ప్లేట్ లెట్స్ ను వేగంగా పెంచడంలో ఈ పండ్లు తోడ్పడతాయి.

Also Read: కొర్రలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

కివీ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడతాయి. కివీ పండ్లు తినడం వల్ల గ్యాస్ సమస్యలు దూరమవుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే కివీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కివీని రోజూ తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు సీజనల్ వ్యాధుల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. కివీ పండ్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి.

కివీ పండ్లు రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ , గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఉబ్బసం సమస్యతో బాధ పడేవాళ్లు కివీ పండ్లు తింటే ఆ సమస్య తగ్గుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే కివీ తినడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కివీ పండ్లలో శరీరానికి అవసరమైన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

Also Read: పరగడుపున రాగిజావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

ఫోలేట్, విటమిన్ సి పుష్కలంగా ఉండే కివీ పండ్లు గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అధిక బీపీ సమస్యతో బాధ పడేవాళ్లు ఎనిమిది వారాలు కివీ పండ్లను తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కివీ పండ్లు తోడ్పడతాయని చెప్పవచ్చు

Back to top button