ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

బాబును రాజీ’డ్రామా’లతో కొట్టాలనుకున్న జగన్


ఏపీ మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన మరుక్షణం చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి.. తీవ్రంగా ఖండించి నానాయాగీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పోరుబాటకు శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు.

Also Read: ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా జనసేన?

ఈ అందివచ్చిన అవకాశాన్ని బాగా వాడుకోవలని జగన్ అండ్ కో డిసైడ్ అయ్యింది. అందుకే తాజాగా సోషల్ మీడియాలో.. మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అయ్యింది. ‘‘మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేయడానికి నిర్ణయించారని.. రేపు గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాలు అందించనున్నట్టు’’ మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

నిజానికి ఈ ప్రచారం వెనుక జగన్, వైసీపీ అధిష్టానం పెద్దలు ఉన్నట్టు సమాచారం. కావాలనే చంద్రబాబును ఈ ప్రచారంలో ఇరికించి ఆయనను ఉసిగొల్పి రాజీనామా చేయించి ఉన్న 23 సీట్లను కూడా చేజిక్కించుకోవాలని వేసిన ఎత్తుగడ వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది.

అందుకే మంత్రి కొడాలి నాని తరువాత ఎంట్రీ ఇచ్చి చంద్రబాబును బండ బూతులు తిట్టి ‘దమ్ముంటే రాజీనామా’ చేయి అని సవాల్ చేశారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో 20కి 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక మరికొంతమంది వైసీపీ నేతలు కూడా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రాజీనామా చేయి బాబు అంటూ తొడగొడుతున్నారు.

Also Read: అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?

ఇలా చంద్రబాబు అమరావతి వంకతో రాజీనామా చేస్తే ప్రస్తుతం అధికార బలంకు తోడు.. ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే కావడం.. జగన్ పథకాల పంపిణీ ఇలా మొత్తం మోహరించేసి చంద్రబాబును చిత్తుగా ఓడించవచ్చని జగన్ అండ్ కో ఈ ‘టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా’ అంటూ తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది.

దీంతో వైసీపీ కుట్రలను ముందుగానే పసిగట్టిన చంద్రబాబు, టీడీపీ సర్దుకుంది. ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారమని.. తాము అమరావతి తరలింపు మీద ఆగ్రహంగా ఉన్నాం కానీ రాజీనామాలు ఏం చేయడం లేదని చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఇలా జగన్ రాజధాని మార్పును చేయడమే కాదు.. చంద్రబాబును డిఫెన్స్ లోకి నెట్టేలా వ్యూహాలు పన్నుతున్నాడని తెలుస్తోంది.

-ఎన్నం

Tags
Show More
Back to top button
Close
Close