అత్యంత ప్రజాదరణటాలీవుడ్సినిమా

క్రేజీ హీరోయిన్లతో రైటర్ గారి వ్యవహారాలు !

Kona Venkat Nivetha Thomas
ప్రముఖ రచయిత ‘కోన వెంకట్’కి ఒక అలవాటు ఉంది. తనను అడగకపోయినా హీరోయిన్లకు ఆయన ఎప్పటికప్పుడు తన సపోర్ట్ ఇస్తుంటాడు. గతంలో హీరోయిన్ అంజలి విషయంలో ఆయనగారు ఎక్కువ శ్రద్ధ చూపించిన వ్యవహారం తెలిసిందే. ఆ వ్యవహారం కాస్త బాగా వైరల్ కూడా అయింది అనుకోండి. ప్రస్తుతం టాలీవుడ్ లో మరో హీరోయిన్ విషయంలో కూడా కోనగారు చూపిస్తన్న ఇంట్రస్ట్ పై ఇప్పుడు ఆసక్తికర విషయం ఒకటి బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే.. ‘నివేదా థామస్’. అమ్మడికి మంచి ప్రతిభ ఉంది. పైగా ఎక్స్ ప్రెషన్స్ తోనే యూత్ ను కట్టి పడేస్తోంది.

ఇవ్వన్నీ కోనగారు ఆమెలో గమనించారు కాబట్టే.. నివేదాకు మొదటినుండి సపోర్ట్ ఇస్తూ వస్తున్నాడు. నివేదా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ‘నిన్ను కోరి’. ఈ సినిమాలో మొదట హీరోయిన్ వేరు. హీరో – డైరెక్టర్ కలిసి ఒక హీరోయిన్ను ఫైనల్ చేసుకున్నారు. అయితే మధ్యలో కోన గేమ్స్ ఆడి మొత్తానికి నివేదాకి ఆ అవకాశం ఇప్పించాడట. అయితే తనకు వచ్చిన ఛాన్స్ కు పూర్తి న్యాయం చేసింది నివేదా. ఇక అప్పటినుండి ఆమెకు కెరీర్ పరంగా చాల సహాయం చేస్తున్నాడట కోన. అంతెందుకు ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిన ‘వకీల్ సాబ్’ సినిమా కూడా కోనగారి పలుకుబడితోనే ఆమెకు వచ్చిందట.

అలాగే ఆ మధ్య ఎన్టీఆర్ తో చేసిన ‘జైలవకుశ’ సినిమా కూడా నివేదాకి కోన వల్లే వచ్చిందట. తనకు ఇంత సపోర్ట్ చేస్తోన్న కోనకి తానూ ఏమి ఇచ్చినా తక్కువే అవుతుందని.. ఆయన లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఒక్కరు ఉంటే చాలు, తనలాంటి హీరోయిన్ల లైఫే మారుతుందని మొత్తానికీ నివేదా రీసెంట్ గా ఓ పార్టీలో తెగ ఎమోషనల్ అయిపోయిందట. పాపం మరీ ఎక్కువ ఎమోషనల్ అయినట్టు ఉంది, పాపకి కారోనా కూడా వచ్చింది.

Back to top button