ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

అమరావతి నుంచి హైదరాబాద్‌ షిఫ్ట్‌.. కొరియా కంపెనీపై ఏపీ నిర్లక్ష్యం

పార్శిళ్లు ట్రాన్స్‌ఫర్‌‌ చేయడంలోనూ.. సరుకుల రవాణా చేయడంలోనూ కొరియా సంస్థ అయిన లాజిస్టిక్స్‌కు ఎంతో పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా 200 పైగా దేశాల్లో ఈ సంస్థ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయితే.. ఇంత పెద్ద నెట్‌వర్క్‌ కలిగిన ఆ సంస్థ ఇప్పుడు తన కార్యకలాపాలను భారత్‌కూ విస్తరించాలనుకుంది. తన నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో అమరావతి రాజధానిలో స్టాక్‌పాయింట్‌ పెట్టాలని ప్రయత్నించింది. కానీ.. అమరావతిలో స్థలం విషయంలో ఎటూ తేల్చకపోవడంతో అది కాస్త తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయింది.

భారత్‌లో తన కార్యకలాపాలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలతోపాటు చత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 75 స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని తలచింది. ఏపీలోనూ ఏర్పాటు చేయదలచిన ఈ సంస్థ.. అక్కడ సెర్చ్‌ చేయగా అమరావతి అనుకూల ప్రాంతమని నిర్ణయించింది. అమరావతిలో తమకు అనుకూలంగా 50 నుంచి 75 ఎకరాల స్థలం కేటాయిస్తే ఇక్కడ స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేస్తామని కొద్ది నెలల క్రితం ప్రభుత్వానికి ఏఎంఆర్డీయే ద్వారా కంపెనీ విన్నవించింది.

ఈ కంపెనీ అమరావతిలో కనుక ఏర్పాటైతే రాష్ట్రంలోని పలువురికి ఉపాధి లభించడంతోపాటు చుట్టుపక్కల వారికి కూడా జీవనోపాధి దొరికేది. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం సమకూరేది. వీటితోపాటు రేండేళ్లుగా ప్రస్తావనలో లేని అమరావతికి ఎంతోకొంత ఆక్సిజన్‌ ఇచ్చినట్లుగా అవుతుండేది. కానీ.. ఈ లాజిస్టిక్స్‌ సంస్థ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం పక్కనపడేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకాలం వెయిట్‌ చేసిన ఈ సంస్థ.. విసిగిపోయి తెలంగాణకు షిఫ్ట్‌ అయిందనేది వార్త.

ఈ స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటుకు విజయవాడ, గుంటూరు వంటి నగరాలు సైతం అర్హతతోనే ఉన్నాయి. కానీ.. ఈ స్టాక్‌ పాయింట్‌ స్థాపనకు కంపెనీ 50 నుంచి 75 ఎకరాల స్థలం అడుగుతుండడంతో అక్కడ అంత స్థలం దొరకడం కష్టసాధ్యం. అందుకే.. వేలాది ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉన్న అమరావతిని ఆ కంపెనీ ఎంచుకుంది. అమరావతిలో స్టాక్‌ పాయింట్‌ పెడితే.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, కటక్‌ భువనేశ్వర్‌‌, రాయపూర్‌‌ వంటి సిటీలకు కూడా సులభంగా చేరుకోవచ్చు. అందుకే.. ఆ కంపెనీ అమరావతిని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ.. అంతపెద్ద సంస్థ అభ్యర్థనను ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం రిజక్ట్‌ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Back to top button