బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Kangana Ranaut Dating: లవ్ జిహాద్ నా? ఆ కుర్రాడితో కంగన డేటింగ్

కమల్ రషీద్ ఖాన్ తన ట్వీట్ లో కంగనా రనౌత్ ఈజిప్టుకు చెందిన ఇమ్రాన్(Imran) అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. దీన్ని లవ్ జిహాద్ గా పేర్కొనడం గమనార్హం.

Kangana datingసినిమా తారలపై పుకార్లు రావడం కొత్తేమీ కాదు. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) పై కూడా వివాదాస్పద ప్రకటన ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ క్రిటిక్ రషీద్ ఖాన్ ఆమెపై ఈ మేరకు ట్వీట్ చేశాడు. దీంతో అది హల్ చల్ చేస్తోంది. సెలబ్రిటీలపై వివాదాస్పద ట్వీట్లు చేసే కేఆర్ కే ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. కంగనా వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టి సంచలనానికి కేంద్ర బిందువు అయ్యాడు. బాలీవుడ్ లో శక్తివంతమైన నటిగా గుర్తింపు పొందిన కంగనాపై పలు రకాల పుకార్లు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ నటీమణులతో ఎక్కువగా గొడవలు పెట్టుకునే కంగనాపైనే కేఆర్ కే(KRK) టార్గెట్ చేయడం తెలిసిందే.

అన్ని విషయాల్లో సూటిగా మాట్లాడే కంగనా రనౌత్ నటన అంటే అందరికి ఇష్టమే. దీంతో ఆమె అందరికంటే ఎప్పుడు ముందు ఉంటుంది. ఆమెకు ఏ డ్రెస్ అయినా ఇట్లే నప్పుతుంది. భారతీయ దుస్తులతోపాటు పాశ్చాత్య వేషధారణలో కూడా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా అనేక దుస్తుల్లో ప్రజలను రంజింపచేసింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితంపై కమల్ రషీద్ ఖాన్ సంచలన ప్రకటన చేసి వివాదాస్పదం అయ్యాడు. దీంతో కంగనా రనౌత్ గురించి ఇన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు ఆజ్యం పోస్తూ ట్వీట్ చేయడంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

కమల్ రషీద్ ఖాన్ తన ట్వీట్ లో కంగనా రనౌత్ ఈజిప్టుకు చెందిన ఇమ్రాన్(Imran) అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. దీన్ని లవ్ జిహాద్ గా పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు కంగనాను లక్ష్యంగా చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమల్ రషీద్ ఖాన్ కంగనా రెండు ఫొటోలను కూడా ట్వీట్ చేశాడు. ఆమె ఓ వ్యక్తితో చనువుగా ఉంటుందని పేర్కొన్నాడు. కానీ ఆ ట్వీట్ ను వెంటనే తొలగించాడు. కానీ అప్పటికే అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో కంగనా పేరుకు లవ్ జిహాద్ అని యాడ్ చేయడంపై విమర్శలే వస్తున్నాయి.

ప్రజల నుంచి కూడా పెద్ద మొత్తంలో విమర్శలు రావడంతో అతడు దాన్ని తొలగించాడు. నిజానికి కంగనా అతని ఫొటోను జులై 28న పోస్టు చేసి అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. అతడిని రిజ్వాన్ గా అభివర్ణించినట్లు సమాచారం. ఇంకా అతడికి పుట్టిన రోజు కేక్ తినిపించి ముద్దు కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో కేఆర్ కే పెట్టిన ట్వీట్ పై పెద్దగా చర్చ సాగుతోంది.

కానీ కంగనా రనౌత్ తరఫు న్యాయవాది తప్పుడు పుకార్లు వ్యాప్తి చేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నా క్లయింట్ చిత్రాలను తప్పుగా, దుర్మార్గంగా ఉపయోగించిన ప్రతి ఒక్కరు బాధ్యులవుతారని చెప్పారు. దీంతో పోస్టులు తీసేయకుంటే అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల బుడాపెస్ట్ లో కంగనా చిత్రం ధాకాడ్ పార్టీలో కూడా ఆ వ్యక్తి కనిపించినట్లు తెలుస్తోంది. మంగళవారం కంగనా, బుడాపెస్ట్ లో ధాకాడ్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది.

Back to top button