తెలంగాణరాజకీయాలు

పవన్ కళ్యాణ్ ని “అన్నా..” అని పిలిచిన కేటీఆర్!

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెరో 50లక్షలు విరాళాలు ప్రకటించిన విషయం తెల్సిందే..ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

పవన్ కళ్యాణ్ కేటీఆర్ ని “సార్” అని సంభోదించగా.. “సార్’ ఎందుకులే అన్నా.. తమ్ముడు అను చాలు” అన్నాడు.పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పందించి “సరే తమ్ముడు” అన్నాడు. ఈ విధంగా వారి మధ్య సంభాషణ జరగడంతో ట్విట్టర్ లో వారి పోస్టులకు అటు పవన్ ఫ్యాన్స్ , ఇటు కేటీఆర్ అభిమానులు ఆసక్తిగా కామెంట్స్ పెడుతున్నారు

కరోనావైరస్ భయంతో దేశం మొత్తం లాక్‌ డౌన్‌ అమలులో ఉంది. ఈ సమయంలో సహాయార్ధం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు చెరో రూ. 50 లక్షలు ఇచ్చారు.

ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తే… తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పవన్‌ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ కేటీఆర్‌ ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు పవన్‌. అందులో కేటీఆర్‌ ను సర్‌ అని పవన్‌ సంబోధించారు.