తెలంగాణరాజకీయాలు

కేటీఆర్ ‘దక్షిణాది‘ జపం

KTR
తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీపై దూకుడుగా ఉన్న సమయంలో దక్షిణాది వాదం వినిపించేవారు. దక్షిణ రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో పన్నుల ద్వారా ఆదాయం పొందుతున్న కేంద్రం.. వాటిని ఉత్తరాదికి ఖర్చు చేస్తోందని ఆరోపించేవారు. గ్రేటర్ ఎన్నికల తరువాత ఆ వాదనలను పూర్తిగా మానుకున్నారు. అయితే ఇప్పడు హఠాత్తుగా.. కేటీఆర్ మళ్లీ దక్షిణాది వాదం వినిపించారు. తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పూర్తిగా బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

Also Read: సర్పంచ్‌ పదవికి అర్హతలు.. అనర్హతలు ఇవీ!

బులెట్ రైలు, హై స్పీడు ప్రాజెక్టులన్నీ.. గుజరాత్.. ఢిల్లీ, ముంబయికే పరిమితం అయ్యాయని.. హైదరాబాద్ ను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మ నిర్బర్ ప్యాకేజీపై కూడా స్పందించారు. దాని ద్వారా లాభం చేకూరిందని ఒక్కరు కూడా చెప్పడం లేదని అన్నారు. తెలంగాణకు ప్రాజెక్టులు, పరిశ్రమలు కేటాయించాలని ఎన్నోసార్లు లేఖలు రాసినా.. కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. 80 సీట్లుంటే.. రాజ్యమేలుదామని అనుకున్నారని.. 17 సీట్లు ఉన్నాయి కాబట్టి.. సరిపోయిందన్నారు. అంటే దక్షిణాదిలో కేవలం 17 సీట్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.

Also Read: కేసీఆర్ ఫోకస్ ‘సౌత్’.. టార్గెట్ ఫిక్స్

కేటీఆర్ దక్షిణాది వాదాన్ని తెరపైకి తీసుకురావడం వెంటనే వైరల్ అయ్యింది. కిషన్ రెడ్డి కూడా ఈ విషయమై స్పదించారు. అనవసర రాజకీయం చేయకుండా ఉంటే.. తెలంగాణకు మంచిదని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పరిస్థితుల ప్రకారం.. బీజేపీతో వీలైనంత సమారస్యంగా ఉండాలన్న పద్ధతిని కేటీఆర్ పాటిస్తున్నారు. బీజేపీ సైతం గ్రేటర్ ఎన్నికల నాటి స్పీడును ఇప్పడు చూపించడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Back to top button