అత్యంత ప్రజాదరణఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

SP Deepika Patil: ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆశ్చర్యపరిచిన లేడీ ఎస్పీ

విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ బస్సులో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు.

Vijaynagaram SP Deepika Patil

విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ బస్సులో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు. తన కుమారుడుతో కలిసి దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అందరితో కలివిడిగా జర్నీ చేశారు.. బస్సు ఎక్కిన యువత, మహిళలతో కలసి కుటుంబసభ్యుల వలె మాటామాటా కలిపి బాగోగులు తెలుసుకున్నారు.. పోలీసులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అడిగి తెలుసుకున్నారు.. ప్రస్తుత్తం మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాల పై అవగాహన కల్పించారు.. సోషల్ మీడియాకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని సూచించారు..

ఇటీవల జిల్లాకు వచ్చిన ఎస్పీ దీపికా పాటిల్ మహిళ భద్రత, దిశ యాప్ వినియోగం పై పెద్ద ఎత్తున విస్తృత ప్రచార0 చేస్తున్నారు.. గడిచిన ఇరవై రోజుల్లో మూడు లక్షల ముప్పై వేల మంది మహిళల మొబైల్స్ లో దిశ యాప్ డౌన్ లోడ్ చేయించి ఆపదలో ఉన్నప్పుడు ఎస్ ఓ ఎస్ కాల్ ద్వారా ఏ విధంగా పోలీసులకు సమాచారం అందించాలనే అంశం పై అవగాహన కల్పించారు..

అంతే కాకుండా దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకొని మొబైల్ చూపిస్తే నగరంలో ప్రయాణించే మహిళలు, విద్యార్థినిలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారు.. అందులో భాగంగా ఈ రోజు ఎస్ పి దీపికా పాటిల్ పోలీసులు ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సు లో ప్రయాణించారు.. ఎస్ పి చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.. అంతేకాకుండా జిల్లా మహిళలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.. అయితే జిల్లాలో ప్రతి మహిళ మొబైల్ లో దిశ యాప్ ఉండటమే తన లక్ష్యమని, ఆ దిశగా అన్ని రకాల చర్యలు చేపడతామని అంటున్నారు దీపికా పాటిల్.. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అనీల్ పులిపాటి తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..

Back to top button