అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

సృజనశీలురకు అవకాశం: కొత్త టాలెంట్ కోసం ‘యూవీ కాన్సెప్ట్స్’ ప్రారంభం

Launch of ‘UV Concepts’ for new talent

టాలీవుడ్‌లోని ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్‌లలో యువీ క్రియేషన్స్ ఒకటి. ప్రభాస్ స్నేహితులు కలిసి ప్రారంభించిన ఈ సంస్థ టాలీవుడ్ లో అగ్ర పొడక్షన్ హౌస్ లో ముందుంది. సాహోతో పాన్-ఇండియా సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

యూవీ ప్రొడక్షన్ హౌస్ పెద్ద బడ్జెట్ చిత్రాలను తీయడానికి ప్రసిద్ది చెందింది. వీరి ఆధ్వర్యంలో వస్తున్న తదుపరి చిత్రం రాధే శ్యామ్. ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రాన్ని త్వరలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.

తాజా వార్త ఏమిటంటే, యూవీ క్రియేషన్స్ ‘యువీ కాన్సెప్ట్స్’ పేరుతో తమ సొంత అనుబంధ సంస్థను పెట్టారు. వారు ఈ బ్యానర్ ద్వారా నూతన దర్శకులు, రచయితలను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించారు. కంటెంట్ ఆధారిత తక్కువ బడ్జెట్ చిత్రాలను నిర్మించనున్నారు.

యువీ కాన్సెప్ట్స్ రాబోయే రోజుల్లో వర్ధమాన నటులు, దర్శకులు, స్క్రిప్ట్ రైటర్స్ మరియు ఇతర సాంకేతిక నిపుణులతో సహా కొత్త ప్రతిభను వెలికితీయనుంది. వారితో మంచి చిత్రనిర్మాతలతో సహకారానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రొడక్షన్ హౌస్ ఇప్పటికే కొన్ని కాన్సెప్ట్-ఓరియెంటెడ్ ప్రాజెక్టులను కార్యరూపం దాల్చింది. అవి ప్రారంభమై వివిధ దశలలో ఉన్నాయి.

యూవీ కాన్సెప్ట్స్ చేత ప్రారంభించబడిన ప్రాజెక్ట్ ఇప్పటికే షూట్ పూర్తయింది. దీనిపై అధికారిక ప్రకటన రేపు మార్చి 5 న చేయబోతున్నారు. సో టాలెంట్ ఉన్న నటులు, దర్శకులు, స్క్రిప్ట్ రైటర్స్ త్వరపడండి.

Back to top button