టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఆ చేదు అనుభవం పై లావణ్య ఫైర్ !

Lavanya Tripathiసొట్టబుగ్గల సుందరి ‘లావణ్య త్రిపాఠి’కి మిస్ అయిన అవకాశాలను చూస్తే.. మరో కాజల్ అగర్వాల్ అయ్యి ఉండేది, కానీ ఏం లాభం ? ఈ ముదురు భామకు కెరీర్ బిగినింగ్ నుండి అసలు టైం కలిసి రాలేదు. దీనికితోడు చేసిన సినిమాలన్నీ ప్లాప్ లే. మొత్తానికి ఆ ప్లాప్ ల పరంపరలో కెరీర్ ఎలాగోలా అతి కష్టంగా నెట్టుకొస్తోంది లావణ్య.

అయితే, ఛాన్స్ లు లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌ గా ఉంటూ నెటిజన్లకు అపుడప్పుడు తన అందాలతో కనువిందు చేస్తూ అరకొర ఛాన్స్ తో తన సినీ ప్రయాణాన్ని భారంగా లాక్కొస్తోంది. ఇలాంటి కష్ట సమయంలో ఉన్న ఈ బ్యూటీకి తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది. లావణ్య ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్‌ అయింది.

ఒక్కోసారి అవొచ్చు.. అది సహజమే కదా. కానీ తన ప్రయాణానికి కలిగిన అంతరాయాన్ని అసలు భరించలేకపోతోంది లావణ్య. ఆ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా పై తనదైన శైలిలో విరుచుకుపడింది. సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ చేస్తూ విమానం క్యాన్సిల్‌ అయిన విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదు అంటూ సదరు సంస్థ పై ఫైర్‌ అయ్యింది ఈ హోమ్లీ బ్యూటీ.

అసలు తానూ విమానంలో సీటు రిజర్వ్‌ చేసుకున్న తర్వాత ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అని ఎలా చెబుతారు ? సీటు రిజర్వ్‌ అయింది అని మెసేజ్ పంపిన తర్వాత, మళ్ళీ విమానం క్యాన్సిల్ అయిందని మెసేజ్‌ ఎలా వస్తోంది ? మీకు ఆ మాత్రం అవగాహన లేకుండానే ఫ్లైట్ నడుపుతున్నారా ? అంటూ లావణ్య మండిపడింది.

పనిలో పనిగా ఇలాంటిది గతంలో మీలో ఎవరికైనా జరిగిందా అంటూ ఫ్యాన్స్‌ ను ఎదురు అడిగింది. ఏమిటో లావణ్య.. సినిమా ఇండస్ట్రీ పై కోపాన్ని విమాన సిబ్బంది పై చూపిస్తే ఉపయోగం ఏముంది ?

Back to top button