టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

దర్శకుల దినోత్సవం నాడు దర్శకుల దురదృష్టకరం !

dasari narayana raoదర్శకుడు అనే పదానికి స్టార్ డమ్ తెచ్చిన గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఆయన, వరుసగా పన్నెండు హిట్లు ఇచ్చిన మొట్టమొదటి గొప్ప దార్శనికుడు ఆయన. ఆ ‘దిగ్దర్శకుడు’ పేరే దాసరి నారాయణరావు. దర్శకరత్న అనే పదానికి పర్యాయ పదంగా నిలిచిన ఆ మహనీయుడు జ‌యంతి నేడు. ఎందరో దర్శకులు వస్తారు పోతారు, దాసరి లాంటి దర్శకుడు మాత్రం మళ్ళీ పుట్టడు.

ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలన్నా.. ఆయన తరువాతే ఎవరైనా. చిన్న నిర్మాతలకు ఆయన పెద్ద దిక్కు. చిత్రసీమలో న్యాయానికి మేస్త్రి ఆయన. అందుకే తెలుగు సినిమాకి ఉనికి ఉన్నంత వరకూ దాసరి ప్రస్థానం గురించి పురాణ ఇతిహాసాల మాదిరిగా ఆయన గురించి అనేక కథనాలను భవిష్యత్తు తరాలు చెప్పుకుంటూనే ఉంటాయి.

ఎందుకంటే ఏభై మంది అనామకులకు నటీనటులుగా జన్మనిచ్చిన దేవుడు ఆయన. ఎనభై మంది సినీ సాంకేతిక వర్గానికి చెందిన అవకాశం ఇచ్చి వారికీ సినీ బతుకును అందించిన దానవుడు ఆయన. దాసరి జయంతి అంటూ ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో ఏదో మొక్కుబడిగా దాసరి విగ్రహానికి పూలమాలలతో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు గానీ,

కొన్ని వేలమంది జీవితాలలో దాసరి వెలుగులను నింపారు. తన సినిమాలతో కొన్ని లక్షల మంది హృదయాలలో సంతోషాలను వెదజల్లారు. అందుకే దాసరి పుట్టిన రోజే డైరెక్ట‌ర్స్ డే అయింది. గతంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీ గర్వంగా సగర్వంగా దాసరి జయంతిని దర్శకుల దినోత్సవం ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ క‌రోనా వ‌ల్ల డైరెక్ట‌ర్స్ అంద‌రూ లేకుండా, డైరెక్ట‌ర్స్ డేను సింపుల్ గా చేసుకోవాల్సి రావడం దర్శకుల దురదృష్టకరం.

Back to top button