ఆంధ్రప్రదేశ్రాజకీయాలువైరల్

చంద్రబాబు, జగన్ లపై సుప్రీం కోర్టుకు ఉండవల్లి లేఖ

Letter to the Supreme Court on Chandrababu and Jagan

ఉండవల్లి అరుణ్ కుమార్.. ఈ రాజమండ్రి మాజీ ఎంపీ దేనిమీదైనా సూటిగా.. సుత్తిలేకుండా మాట్లాడుతుంటారు. దివంగత వైఎస్ఆర్ కు నమ్మిన బంటు అయిన ఉండవల్లి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ పార్టీ ఏపీలో అంతర్థానం అయ్యాక మరే పార్టీలో చేరకుండా రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకున్నారు. అయితే సమకాలీన రాజకీయాలపై మాత్రం ఉండవల్లి బాగానే స్పందిస్తుంటారు. తాజాగా ఏపీలో రాజకీయ పార్టీల పరిణామాలపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఆ లేఖలో సంచలన విషయాలను పంచుకున్నారు.

Also Read: జనసేనాని.. బయటకు రావాల్సిందేనా?

రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన ఉండవల్లి ఈ సందర్భంగా ఒకేసారి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులను గురిపెట్టడం విశేషం. ఇప్పుడు జరుగుతున్న విచారణలు చాలా ముఖ్యమైన నేతలదని ఉండవల్లి పరోక్షంగా అభిప్రాయపడ్డారు.. ఈ రాష్ట్రాన్ని 15 ఏళ్లు పాలించిన మాజీ ముఖ్యమంత్రిపై కేసు ఉందని.. ఏపీ చరిత్రలోనే అత్యధిక ఓట్ షేరింగ్ సాధించి ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రిపై కేసు ఉందని.. రెండూ కూడా అవినీతి ఆరోపణల కేసులని.. అందుకే దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలని తాను సుప్రీం కోర్టును కోరుతూ మెయిల్ చేశానని ఉండవల్లి తెలిపారు. అప్పుడే ప్రజల్లో క్లారిటీ వస్తుందని ఉండవల్లి అన్నారు. మనం ఓట్లేసిన నాయకులపై నమోదైన కేసుల విచారణను కోర్టులు లైవ్ లో చూపించాలని తాను సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు మెయిల్ ద్వారా లేఖ రాశానని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

ఇప్పటికే కరోనా కారణంగా కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చ్యువల్ విచారణలు జరుపుతున్నాయని.. తాను రాజమండ్రిలో ఉండే ఇటీవల సుప్రీం కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యానని.. ప్రజల్లో అపోహలు తొలగాలంటే కోర్టుల్లో విచారణ లైవ్ ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరానని ఉండవల్లి కోరారు. మీడియా, రాజకీయ పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేయాలని ఉండవల్లి కోరారు. సీఎం జగన్ పై కేసులో టీడీపీ లక్ష కోట్లు అవినీతి అంటూ చాలా ఆరోపణలు చేసిందని.. కానీ సీబీఐ కేవలం 13 వేల కోట్ల రూపాయలు మాత్రమే చార్జిషీట్ లో చూపించిందన్నారు. ఈ క్రమంలోనే ఓట్లేసిన ప్రజలకు అసలు ఈ కోర్టుల్లో ఏం జరుగుతుందో తెలిసేలా లైవ్ చూపించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

Also Read: పెద్ద స్కెచ్: జగన్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌?

కోర్టుల్లో జరిగింది జరిగినట్టు చూపిస్తే ఇన్ని అనర్థాలు ఉండవని ఉండవల్లి అన్నారు. ఒక పేపర్లో ఒకలా ఉంటుందని.. మరో పేపర్లో మరోలా రాస్తున్నారని.. మనకేమో ఏది నమ్మాలో తెలియడం లేదని.. కొన్ని అధికార పార్టీ చానెల్స్ , పత్రికలు ఉన్నాయని.. మరికొన్ని ప్రతిపక్ష చానెల్స్, పత్రికలు ఉన్నాయని.. ప్రజలకు ఇంకోరకంగా చెప్పి బ్రెయిన్ వాష్ చేసి గందరగోళం పరుస్తున్నాయని ఉండవల్లి అన్నారు. ఈ నేపథ్యంలో కోర్టుల్లో జరిగింది జరిగినట్టుగా ప్రజలకు చూసేందుకు అవకాశం కల్పించినట్టైతే ఎలాంటి అపోహలు ఉండవని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

Back to top button