వ్యాపారము

LIC Aadhaar Shila: మహిళలకు ఎల్ఐసీ శుభవార్త.. కేవలం 250 రూపాయలకే పాలసీ?

దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల నుంచి సీనియర్

LIC Aadhaar Shila: Just 250 Rupees Policy For Females

LIC Aadhaar Shila: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ ప్రయోజనం చేకూరేలా ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయి. మహిళల కోసం కూడా ఎల్ఐసీ కొన్ని ప్రత్యేక పాలసీలను అందిస్తుండటం గమనార్హం. ఆధార్ శిలా పేరుతో ఎల్ఐసీ ఈ పాలసీని అమలు చేస్తుండగా 8 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు.

ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు మరణిస్తే కుటుంబ సభ్యులు డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ తర్వాత డబ్బు పొందవచ్చు. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు టర్మ్ ఉండగా నచ్చిన టర్మ్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కనీసం 75,000 రూపాయల నుంచి గరిష్టంగా 3,00,000 రూపాయల వరకు పాలసీలను తీసుకోవచ్చు. ప్రీమియం డబ్బులు, డెత్ క్లెయిమ్‌పై పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఆధార్ శిలా పాలసీతో మహిళలకు ఇన్సూరెన్స్ తో పాటు పాలసీ ముగిశాక డబ్బు లభించనుండటం గమనార్హం. గ్యారంటీడ్ రిట‌ర్న్ ఎండోమెంట్ స్కీమ్ కింద ఈ పాలసీని కేవలం 250 రూపాయలు చెల్లించి కూడా తీసుకోవచ్చు. ఆధార్ కార్డుతో ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ నచ్చకపోతే పాలసీ తీసుకున్న 15 రోజుల్లో క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

నెలకు కేవలం 250 రూపాయలు చెల్లించడం ద్వారా 75,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ను పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారు మరణిస్తే నామినీలకు మొత్తం ఇన్సూరెన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మహిళలకు ఈ పాలసీ వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ పాలసీని నెలవారీ, మూడునెలలకు, ఏడాదికి కూడా చెల్లించే అవకాశం అయితే ఉంటుంది.

Back to top button