అత్యంత ప్రజాదరణవ్యాపారము

ఎల్‌ఐసీ అదిరిపోయే పాలసీ.. తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షలు..?

LIC Bima Joyti Plan

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో బీమా జ్యోతి పాలసీ కూడా ఒకటి. పిక్స్‌డ్ ఇన్‌ కమ్, గ్యారంటీ రిటర్న్స్ పొందాలని భావించే వాళ్లు బీమా జ్యోతి పాలసీని తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల ఎంత మొత్తానికైనా ఈ పాలసీని సులభంగా తీసుకోవచ్చు. కనీసం లక్ష రూపాయలకు ఈ పాలసీని తీసుకోవచ్చు.

15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకోవచ్చు. 15 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకుంటే 10 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకుంటే మాత్రం 15 సంవత్సరాల ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు.

ఈ పాలసీ ద్వారా క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ కూడా లభిస్తుండటంతో పాలసీ తీసుకున్న వారికి భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఈ పాలసీని ఆన్ లైన్ లో కూడా తీసుకునే అవకాశం ఉండగా పాలసీ తీసుకున్న వాళ్లు పాలసీ టర్మ్ కు 5 సంవత్సరాలు తక్కువ కాలం ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరం వయస్సు ఉన్న పిల్లల పేర్లపై పాలసీని తీసుకుంటే 5 లక్షల రూపాయల మొత్తానికి నెలకు 3,000 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాలి.

తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించి మెచ్యూరిటీ కాలంలో ఏకంగా 10 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. రోజుకు కేవలం 100 రూపాయలు ఆదా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 10 లక్షల రూపాయలు పొందవచ్చు.

Back to top button