వ్యాపారము

ఎల్‌ఐసీ అదిరే పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిల్లల భవిష్యత్ కోసం డబ్బులు ఆదా చేయాలని యోచిస్తున్న వారి కొరకు న్యూ చిల్ట్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ను అందిస్తోంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు ఈ పాలసీ వల్ల పిల్లల భవిష్యత్‌కు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడవచ్చు. పుట్టిన పిల్లల నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు.

పాప లేదా బాబు పుట్టిన తొలి ఏడాదిలోనే పాలసీ తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఉదాహరణకు 10 లక్షలర్ రూపాయల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు 3,500 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లకు 18 ఏళ్లు వచ్చినప్పుడు 20 శాతం డబ్బులు వస్తాయి. 20 ఏళ్లు, 22 ఏళ్లు, వచ్చినప్పుడు కూడా 20 శాతం డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.

మెచ్యూరిటీ సమయంలో మిగిలిన 40 శాతం డబ్బులు పొందే అవకాశం ఉండగా ఈ డబ్బుతో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే నామినీ డబ్బులు, బోనస్ వంటివి పొందే అవకాశం ఉంటుంది. 10 లక్షల రూపాయల బీమా తీసుకున్న వాళ్లకు ఏకంగా 26 లక్షల రూపాయలు లభిస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలకు పాలసీ టర్మ్ 25 ఏళ్లుగా ఉంటుంది.

తొలి ఏడాదే పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల కోసం పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లు ఈ పాలసీని తీసుకుంటే మంచిది.

Back to top button