టెక్నాలజీవైరల్

డ్రైవింగ్ పరీక్ష లేకుండానే లైసెన్స్ పొందవచ్చు.. ఎలా అంటే…?

License without driving test

కేంద్ర రహదారి, రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ పరీక్ష లేకుండానే లైసెన్స్ ను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కేంద్ర రహదారి, రవాణా శాఖ అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొన్ని తప్పనిసరి నిబంధనలను విధించింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయని సమాచారం. నూతన నిబంధనల ప్రకారం ఇకపై డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, సిమ్యులేటర్ ఉండాలి.

మోటారు వాహనాల చట్టం 1988 నిబంధనల ప్రకారం రిఫ్రెషర్ కోర్సుతో పాటు రెమిడియల్ కోర్సు అందుబాటులో ఉండాలి. ఎవరైతే ఈ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సును పూర్తి చేస్తారో వాళ్లు డ్రైవింగ్ టెస్ట్ కు హాజరు కాకుండానే లైసెన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర రహదారి, రవాణా శాఖ ఈ కేంద్రాలలో పారిశ్రామిక ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడానికి అనుమతులు ఇస్తోంది.

ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడానికి శిక్షణ సంస్థ గుర్తింపు పొందాలంటే కనీసం ఎకరం స్థలం ఉండాలి. ఈ వాహనాలతో పాటు భారీ ప్యాసింజర్, ట్రెయిలర్స్, సరుకు రవాణా వాహనాలు నడపాలంటే కనీసం రెండు ఎకరాల స్థలం కలిగి ఉండాలి. శిక్షణ కేంద్రానికి బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కచ్చితంగా ఉండాలి. శిక్షణ తరగతుల కోసం సిమ్యులేటర్స్ ను తప్పనిసరిగా వినియోగించాలి.

అన్ని రకాల డ్రైవింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేసుకుని అనువైన శిక్షణ ఇవ్వడంతో పాటు తగిన సంఖ్యలో టీచింగ్ సిబ్బంది ఉండాలి. శిక్షణ ఇచ్చే అన్ని వాహనాలకు బీమా కచ్చితంగా ఉండాలి. ఒకసారి డ్రైవింగ్ స్కూల్ కు అక్రిడిటేషన్ మంజూరు అయితే ఐదు సంవత్సరాల పాటు అది అమలులో ఉంటుంది. శిక్షణ ఇచ్చే శిక్షకులకు ఇంటర్ విద్యార్హతతో పాటు మోటార్ మెకానిక్స్ లో ప్రొఫిషియన్సీ టెస్ట్ సర్టిఫికెట్ ఉండాలి.

Back to top button