సినిమాసినిమా వార్తలు

శవాల మధ్యలో స్టార్ హీరో.. ఏం జరిగింది?

16 ఏళ్ల కింద సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉన్న అతడికి అనూహ్యంగా సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోను చేసింది.తమిళ హీరో ‘ఆర్య’ సినీ ప్రయాణమే ఒక వింత అని చెప్పొచ్చు. తాజాగా తీసిన ‘సార్పట్ట’ సినిమాతో అతడి ఖ్యాతి దేశమంతా వ్యాపించింది.

అయితే ఆర్య పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జాబ్ వదిలి సినిమాల కోసం తిరిగి చివరకు వరుసగా మూడు హిట్స్ తో ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో ‘నేను దేవుణ్ని’ సినిమా కోసం అఘోర పాత్రలో మూడు రోజులు శ్మశానంలో శవాల మధ్య కూర్చుండి అఘోర సాధువులను గమనిస్తూ ఆ పాత్రను పండించాడు ఆర్య. దర్శకుడు చెప్పాడని శవాల మధ్య కూర్చున్న ఆర్యకు కళ్లు తిరిగి సొమ్మ సిల్లి పడిపోయేవాడట.. సినిమా కోసం అలా చేయాల్సిందే అంటే ఆర్య చేసిన ఈ కష్టాలకు ఫలితం దక్కింది. ఆ సినిమా హిట్అయ్యింది.

ఇక తాజాగా సార్పట్ట సినిమాతో ఆర్య దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమా కోసం బాక్సింగ్ ను నేర్చుకొని రోజుకు 12 గంటల పాటు సాధన చేశాడు. కరోనా వచ్చినా మొక్కవోని పట్టుదలతో సినిమా పూర్తి చేశాడు. అదిప్పుడు అతడికి మంచి పేరుతీసుకొచ్చింది.

Back to top button