కరోనా వైరస్తెలంగాణరాజకీయాలు

తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్?

Locked down again in Telangana?

సీఎం కేసీఆర్ మరో నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.పదిరోజులుగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల కట్టడితోపాటు బాధితుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణలో స్కూళ్లు కాలేజీలు, బార్లు, ఇతర అన్నింటిని తెరవడంతో కేసులు పెరుగుతున్నాయి. విద్యాలయాల్లోని విద్యార్థులు, టీచర్లకు కూడా కరోనా సోకుతోంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 64898 మందికి కరోనా టెస్టులు చేయగా.. 394 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. శనివారం 364 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతోంది.

తెలంగాణలో తెరిచిన విద్యాసంస్థల్లో కూడా కరోనా వ్యాపిస్తోంది. విద్యార్థులకు సోకుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అలెర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. కేసుల తీవ్రత పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

రాత్రిపూట బార్లు, సినిమాహాళ్లు, ఫంక్షన్లు సహా అన్నింటిని 50శాతం ఆక్యూపెన్సీతోనే నడిచేలా కేసీఆర్ సర్కార్ ఆంక్షలు విధించిబోతోందని.. రాత్రి పూట కర్ఫ్యూ కూడా విధించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

Back to top button