తెలంగాణరాజకీయాలు

లక్కీ స్టూడెంట్స్:2021 టెన్త్ బ్యాచ్ కూడా పాస్

Lucky Students: 2021 Tent Batch also pass

కరోనా ఎంత పనిచేస్తివి.. ఏం చేస్తివి.. 2020,2021 బ్యాచ్ ల తెలంగాణ పదోతరగతి విద్యార్థుల నోళ్లలో పాలు పోస్తివి. చదువకుండానే పాస్ చేస్తివి. చదువు రాని మొద్దులు.. చదువుకున్న తెలివైనోళ్లు అందరినీ ఒక్కటే గాటిన కట్టి అందరినీ పాస్ చేయిస్తివి. అని ఇప్పుడు విద్యావేత్తలు తలలు పట్టుకుంటారు.

కరోనా చేయబట్టి రెండు సంవత్సరాల విద్యార్థులు పరీక్షలు రాయకున్నా పాస్ అయిపోయినారు. దీంతో వీరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు పొందే సమయంలో ఈ పాస్ ఎఫెక్ట్ కనిపించనుంది. మార్కులు లేకుండా కేవలం పాస్ లేదా.. పాత గ్రేడ్ల ఆధారంగా చేసిన ఈ మార్కుల పరంపర తెలివైన విద్యార్థులకు నిజంగానే శాపంగా మారనుంది.

తాజాగా కరోనా ఉధృతితో తెలంగాణలో లాక్ డౌన్ పెట్టేసిన సీఎం కేసీఆర్.. ఈక్రమంలోనే పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ జీవో జారీ చేయించారు. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని టీ సర్కార్ నిర్ణయించింది. టెన్త్ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

కరోనా కారణంగా విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. తాజాగా జీవో జారీ చేసింది.

ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై జూన్ రెండోవారంలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. బ్యాక్ లాగ్ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీసం పాస్ మార్కులు వేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయనుంది.

కరోనా దెబ్బకు ఇలా 2020, 2021 బ్యాచ్ లకు చెందిన రెండు సంవత్సరాల విద్యార్థులు ఈజీగా పాస్ అయిపోయారు. కష్టపడి చదివి పాస్ అయితే అదో కిక్కు. కానీ ఇలా పాస్ అవ్వడం అటు విద్యార్థులను, ఇటు విద్యావేత్తలను సంతృప్తి పరచలేకపోతోంది.

Back to top button