తెలంగాణప్రత్యేకంరాజకీయాలు

‘మా’ కుంపట్లు.. ప్రకాశ్ రాజ్ తీర్చగలడా..?

అధ్యక్ష బరిలోకి విలక్షణ నటుడు

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్టు అసోసియషన్ (మా) సంఘం కీలకమైంది. సినీ ఇండస్ట్రీలో పనిచస కళాకారులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చే ఈ సంఘం ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అయితే చాలా మంది ప్రముఖులు మా సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన మా సంఘం అధ్యక్షుడైతే ప్రయోజనం ఉంటుందా..? లేదా..? అనే చర్చ టాలీవుడ్లో మొదలైంది.

మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్ లాంటి వారి పెద్దలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక రూపు తీసుకొచ్చారు. ఆ తరువాత సినీ పరిశ్రమలోని నటులు, కార్మికులకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి ఒక వేదిక ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మురళీ మోహన్ తదితర సీనియర్ నటుల ఆధ్వర్యంలో మా సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి టాలీవుడ్ కు చెందిన సినీ కార్మికులకు మా అండగా ఉంటూ వస్తోంది. వృద్ధ కళాకారులకు పింఛన్లు, ఆర్థికంగా చితికిపోయిన వారికి సాయం చేయడం వంటివి మా సంఘం చేస్తోంది.

గత రెండు పర్యాయాలుగా మా సంఘంలో రాజకీయాలు చోటు చేసుకున్నారు. సంఘంలోని సభ్యుల మధ్య వచ్చిన విభేదాలు రచ్చకెక్కాయి. అంతకుముందు మా అసోసియేషన్ ఉందన్న విషయం సామాన్య జనానికి తెలిసేది కాదు. కానీ కొందరు సీనియర్ నటుల మధ్య వచ్చిన పొరపొచ్చాల కారణంగా మీడియాకు మా సంఘం గురించి ఫోకస్ చేసే అవకాశం వచ్చింది. దీంతో కొందరు సీనియర్ నటుటు మా సంఘాన్ని పట్టించుకోవడం మానేశారు. సినీ పరిశ్రమ తరుపున సాయం చేయాలనుకునేవారు సొంతంగా చేస్తున్నారు గానీ.. మా సంఘం గురించి మాట్లాడడం లేదు.

ఈ తరుణంలో మా సంఘం ను పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని విలక్షణ నటుడు అంటున్నాడు. ఈ మేరకు త్వరలో జరిగే ఎన్నికలకు ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని అంటున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రకాశ్ రాజ్ మా అధ్యక్షుడైతే ఎలా ఉంటుందన్న ఆలోచలనో సినీ పరిశ్రమకు చెందిన వారు ఇప్పటికే ఆలోచనలో పడ్డారు. అయితే సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ కు సంబంధ ఉన్న ప్రకాశ్ రాజ్ రాజకీయాలు లేకుండా చూస్తారా..? అని కూడా చర్చించుకుంటున్నారు.

Back to top button