జాతీయంరాజకీయాలుసంపాదకీయం

ఈ ఒక్క కార్టూన్ చాలు మోడీ పాలన తీరు చెప్పడానికి..

Magazine satires on Narendra Modi's economic policies

ఈ ఒక్క కార్టూన్ చాలు.. మోడీ పరువు గంగలో కలిసిపోవడానికి.. ఈ ఒక్క కార్టూన్ చాలు.. మోడీ సర్కార్ ను బట్టలిప్పి నిలబెట్టడానికి.. ఈ కార్టూన్ వేసింది ఎవరో బీజేపీ వ్యతిరేకులు కూడా కాదు.. ఒకప్పుడు పరమ బీజేపీ భక్తులు. అవును.. స్వయంగా మోడీని వేయినోళ్ల పొగిడిన ఆ పత్రికాధినేత సొంత పత్రికలో  వేసిన ఈ కార్టూన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సదురు పత్రికాధినేత మోడీ వచ్చిన కొత్తలో ఆయన ఫుల్ హైప్ ఇచ్చాడు. నెత్తిన పెట్టుకున్నాడు. బీజేపీ గెలుపులో ఈయన సాయం కూడా ఉందంటారు. అందుకే మోడీ సార్ దేశంలోనే ప్రతిష్టాత్మక ‘పద్మ విభూషన్’ అవార్డును పత్రికాధినేతకు ఇచ్చాడంటారు. ఇద్దరూ ఒకరినొకరు పొగిడేసుకున్నారు.

కానీ ట్విస్ట్ ఏంటంటే మోడీసార్ కరోనా లాక్ డౌన్ లో తేలిపోయాడని ఈయనే వార్తలు రాస్తున్నారు. మోడీ సరైన ఆర్థిక విధానాలు సరిగా పాటించకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందంటున్నాడు. అది ఇప్పటికీ జాకీలు వేసినా లేవడం లేదంటున్నాడు. రాజన్ లాంటి ఆర్థిక నిపుణులు సైతం మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు బాగా లేవన్నారట. సామాన్యులు, ప్రజలకు ఆదాయాన్ని సృష్టించకుండా వారికి ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకోలేదని మోడీ వ్యతిరేక కథనాలు ఈమధ్య కాలంలో ఆయన వస్తున్నాయట.

ఇక కుదేలైన పరిశ్రమలను, వ్యవస్థలను, పత్రికారంగానికి కూడా మోడీ ఎలాంటి ఉపశమనాన్ని ఇచ్చే చర్యలు తీసుకోలేదని పత్రికా అధినేత ఫీలింగ్ అట . పైగా ప్రింటింగ్ పేపర్ పై సుంకాలు పెంచి పత్రికారంగాన్ని దెబ్బతీశాడని.. ఎంత మొత్తుకున్న మోడీ విధానాలు కార్పొరేట్లకు మేలు చేసేలానే ఉన్నాయన్న విమర్శలు చేస్తున్నాడట. దీంతో బీజేపీ అంటే కోసుకునే ఈ పత్రికాధినేత సైతం మోడీ సర్కార్ విధానాలను ఎండగడుతూ తన పత్రికలో కార్టూన్ వేయించాడు.

ఇంత కరోనా కల్లోలంలో దమ్మిడి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దేశ ప్రజలపై ధరాఘాతం మోపుతున్న మోడీ సర్కార్ ను పత్రికాధినేత కడిగిపారేశాడు. పెట్రోల్ ధరల పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తాడా? అని కార్టూన్ తో ఎండగట్టాడు. రాయితీలు కోత వేసి, వడ్డీలను కోసేసి.. పీఎఫ్ వడ్డీపై పన్ను వేసి సామాన్యుడికి పీల్చేస్తున్న మోడీ సర్కార్ సరైన విధానంలో వెళ్లడం లేదని కార్టూన్ తో మోడీ ముఖం మీదే చెప్పినట్టు అయ్యింది. ఎకానమీ వృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదని ఈ ఒక్క కార్టూన్ నిరూపిస్తుంది. మోడీ అంటే అమితంగా అభిమానించే ఆ పత్రికాధినేత పేపర్లోనే ఇలాంటివి రావడంతో ఇదిప్పుడు చర్చనీయాంశమైంది.

-ఎన్నం

Back to top button