ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్‌ప్రైజ్‌!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు అభిమానులకు ‘సర్కారు వారి పాట’ టీమ్ ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’ పేరుతో ఒక స్పెషల్‌ వీడియో రిలీజ్ చేసి ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ వీడియోలో మహేష్ లుక్స్ అండ్ డైలాగ్స్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా సర్‌ప్రైజ్‌ చేశాయి. మునుపెన్నడూ లేని విధంగా మహేష్ ఈ వీడియోలో సరికొత్తగా కనిపించాడు. ‘ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌’ అంటూ మహేష్ రౌడీలతో చెప్పే డైలాగ్‌ మాడ్యులేషన్ కూడా అదిరిపోయింది.

ఇక కీర్తి సురేష్ ఎక్స్‌ ప్రెషన్స్‌ తో పాటు ఆమె చెప్పిన డైలాగ్ ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అంటూ మహేష్ అందానికి ఫిదా అయినట్టు కీర్తి తన కళ్ళల్లో చూపించిన మెరుపు కూడా చాలా బాగుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ స్పెషల్ వీడియో లైక్స్ అండ్ షేర్ లతో రికార్డు వైడ్ గా ట్రెండ్ ను సెట్ చేస్తూ వైరల్ అవుతుంది.

మొత్తానికి మహేష్ అభిమానులకు ‘సర్కారు వారి పాట’ టీమ్ ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఇక రేపటి నుండి హైదరాబాద్ లో ఈ సినిమా సాంగ్ షూట్ శరవేగంగా జరగనుంది. ఈ సాంగ్ షూట్ లో మహేష్ బాబుతో పాటు కీర్తి సురేష్ కూడా పాల్గొననుంది. ఈ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయబోతున్నాడు. ఈ సాంగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన సెట్ వేశారు.

అన్నట్టు, ఈ ‘సర్కారువారి పాట’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల కథనంలో ఫ్యామిలీ డ్రామాను మిక్స్ చేసి పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని తీసుకురానున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాల చుట్టూ వచ్చే సీన్స్ చాలా బాగుంటాయట.

ఎలాగూ పరుశురామ్ ఏ కథనైనా పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించడంలో స్పెషలిస్ట్. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

Back to top button