అత్యంత ప్రజాదరణగుసగుసలు

‘వకీల్ సాబ్’ అడ్వాన్స్ బుకింగ్ పై మహేశ్ బాబు కామెంట్స్

Mahesh Babu comments on 'Vakil Saab' advance booking

Pawan Kalyan, Mahesh Babu

టాలీవుడ్ వద్ద ‘వకీల్ సాబ్’ ప్రభంజనం కొనసాగుతోంది. సినిమా విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. సినిమాకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే తెలుగు అగ్రహీరోలను సైతం ఆశ్చర్యపోయేంతగా ఉందంటున్నారు.  
తెలుగు రాష్ట్రాలను ‘వకీల్ సాబ్’ మేనియా కమ్మేసింది. విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లతో టాలీవుడ్ ను కుదిపేసిన పవన్ తాజాగా మరో రికార్డు కొట్టబోతున్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమాలు 9న విడుదలవుతోంది. ఇప్పటికే దాదాపు 10 రోజుల పాటు ఈ సినిమా నడిచే థియేటర్లలో బుకింగ్స్ పూర్తి అయిపోయినట్టు టాక్. ఈ విషయంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం కామెంట్ చేయడం విశేషం.

దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్ ఇందులో బీభత్సమైన క్యారెక్టర్ చేశారు.   డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను రూపొందించారు. ఇక టీజర్ చూసిన పవన్ ఫ్యాన్స్ అప్పటి వరకున్న అంచనాలను మార్చేసుకున్నారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని జోష్ లో ఉన్నారు.
 ‘వకీల్ సాబ్’ మూవీకి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.  10 రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయట. వీటిలో మల్టీఫ్లెక్స్లు కూడా ఉన్నాయి.  సూపర్ స్టార్ మహేశ్ బాబు కు చెందిన సొంత థియేటర్ ఏఎంబీకి ఇప్పుడు పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ సెగ తగిలిందట.. గచ్చిబౌలిలోని  ‘ఏఎంబీ’ థియేటర్ లో అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయట. దీంతో మహేశ్ బాబు ఎక్సైట్ మెంట్ గా ఫీలయి వెంటనే దిల్ రాజుకు ఫోన్ చేసి  ఈ విషయాన్ని చెప్పాడట. ఇంతలా అడ్వాన్స్ బుకింగ్ సాధించిన సినిమా కచ్చితంగా హిట్టవుతుందని చెప్పాడట. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో  రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరీ. 

Back to top button