టాలీవుడ్వైరల్సినిమాసినిమా వార్తలు

మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్ వీడియో వైరల్

సూపర్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహేష్ తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినా.. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేశారు.

ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఆయన చిత్రం ‘సర్కారివారి పాట ట్రైలర్’ దుమ్ము లేపింది. త్రివిక్రమ్ తో మహేష్ బాబు చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా లాంచ్ చేశారు. ఈ టీజర్లకు సోషల్ మీడియా, యూట్యూబ్ లో కలిపి రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్స్ వచ్చినట్లు సమాచారం.

ఇక మహేష్ అభిమానులు, సీనీ ప్రముఖులు రకరకాల హ్యాష్ ట్యాగులతో ట్విట్టర్ లో ట్రెండింగ్ మొదలుపెట్టారు.తాజాగా ఈ దెబ్బకు టాలీవుడ్ లో ఏ హీరోకు రానటువంటి రికార్డు ట్రెండింగ్ లైక్స్, వ్యూస్, రీచ్ మహేష్ కు వచ్చేలా ఫ్యాన్స్ అభిమానాన్ని చాటుకున్నారు.

రెండు రోజుల ముందే ప్లాన్ చేసుకొని మిలియన్ల కొద్ది రీచ్ ను ప్లాన్ చేశారు.పాత, కొత్త వీడియోలను ట్వీట్ చేస్తూ రికార్డ్ స్థాయిలో బర్త్ డే ట్రెండింగ్ ను సృష్టించి హల్ చల్ చేశారు.

ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘సర్కారివారి పాట’ టీజర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధికమైన వ్యూస్ వచ్చిన వీడియోగా రికార్డ్ సృష్టించింది. నిన్న ఒక్కరోజులోనే 25.7 మిలియన్ల వ్యూస్, 750k లైక్స్ రావడం ఓ రికార్డుగా చెప్పొచ్చు. బర్త్ డే టీజర్లలో మహేష్ బాబు సరికొత్త రికార్డును నమోదు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

ఇక మహేష్ బాబు ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అయ్యింది. 1000 మందికి పైగా చిన్నపిల్లలకు మహేష్ బాబు గుండె ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్ సమయంలో మహేష్ పేరు చెబితే పిల్లలు హ్యాపీగా ఉంటారని వైద్యులు చెప్పినప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది.. జీవితంలో అంతకంటే ఏమి కావాలి అని మహేష్ ఎమోషనల్ అయిన వీడియో టాప్ ట్రెండిగ్ లో ఉంది.

ఇక తన పుట్టినరోజున ఇంత పెద్ద ట్రెండింగ్ సెట్ చేసిన అభిమానుల ప్రోత్సాహానికి మహేష్ బాబు ఎమోషనల్ అయినట్టు తెలిసింది. ఈ మేరకు ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపాడట మహేష్.

 

Back to top button