టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

మహేష్ నుండి 3 క్రేజీ అప్ డేట్స్!

Mahesh Babuఆగస్టు 9న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పుట్టినరోజు. ఆ రోజున మహేష్ అభిమానులకు ఓ త్రిబుల్‌ ధమాకా ఉండబోతుంది. మహేష్ బర్త్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 9న ఉదయం 9 గంటలకు ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’పేరుతో మహేష్ కొత్త మూవీ అప్‌ డేట్‌ రానుంది. అలాగే ‘సర్కారు వారి పాట’ టీమ్ తమ సూపర్ స్టార్ కి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓ అదిరిపోయే పోస్టర్‌ ను రిలీజ్ చేయనుంది.

ఇక ఎప్పటినుంచో ఊరిస్తున్న మహేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న హ్యాట్రిక్ మూవీకి సంబంధించిన బిగ్ అప్ డేట్ కూడా అదే రోజున రానుంది. మహేష్ 28వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతుంది. మొత్తమ్మీద ఒకే రోజున మహేష్ తన అభిమానులకు మూడు క్రేజీ అప్ డేట్స్ తో ఫుల్ కిక్ ఇవ్వబోతున్నాడు.

అయితే, మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుండి టీజర్ నో, ట్రైలర్ నో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఇష్టాన్ని కాదనలేక ‘సర్కారు వారి పాట’ టీమ్ కూడా ఆ రోజున ఈ సినిమా నుండి ఒక స్పెషల్ టీజర్ ను రెడీ చేయడానికి సన్నాహాలు చేసినా.. స్పెషల్ టీజర్ కి కావాల్సిన షాట్స్ ఇంకా తీయాల్సి ఉందట.

అందుకే, చిన్న పాటి టీజర్ టైప్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పరుశురామ్ 30 సెక‌న్ల‌ గ్లింప్స్‌ని క‌ట్ చేసి, ఫ్యాన్స్ కోసం ఒక పవర్ ఫుల్ డైలాగ్ ను కూడా మిక్స్ చేసి మహేష్ బర్త్ డే ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరి చూడాలి ఆ గ్లింప్స్‌ లాంటి టీజర్ ఎలా ఉండబోతుందో. ఇక ఈ పుట్టినరోజును కూడా మహేష్ తన ఫ్యామిలీ అండ్ సన్నిహితుల సమక్షంలోనే చేసుకోకున్నాడు.

Back to top button