అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

గోవాలో కీర్తి సురేష్ తో మహేష్ బాబు

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’.. కీర్తి సురేష్ హీరోయిన్. ఇటీవల దుబాయ్ షెడ్యూల్ లో మహేష్ బాబు యాక్షన్ సీన్స్ చేశాడు. ఇప్పుడా షూటింగ్ పూర్తయినట్టు చిత్రం యూనిట్ అధికారికంగా తెలిపింది.

Also Read: సునీతకు ఆఫర్లు మామూలుగా లేవుగా..

నెలరోజులుగా దుబాయ్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపిన యూనిట్ తాజాగా ఆ షెడ్యూల్ ఫినిష్ చేసేసింది.. దుబాయ్ లో మహేష్ బాబు ఎంట్రీ ఇంట్రడక్షన్ ఫైట్ ను పూర్తి చేశారట.. యాక్షన్ సన్నివేశాలతో పాటు మహేష్ బాబు, కీర్తి సురేష్ లపై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు.

తాజాగా తర్వాత షెడ్యూల్ ను వెంటనే దర్శకుడు పరుశురాం ప్లాన్ చేశారట.. గోవా ట్రిప్ ప్లాన్ చేశారని.. అక్కడ అందమైన లోకేషన్లలో మహేష్ , కీర్తి సరేష్ లపై ఓ సాంగ్ షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Also Read: సిటీమార్ ట్రైలర్ టాక్: గోపీచంద్ కబడ్డీ ఆడేశాడు..

దూబాయ్ షూటింగ్ త్వరగా ఫినిష్ కావడంతో అక్కడి నుంచి నేరుగా గోవా వెళ్లనున్నారట.. గోవా బీచ్ లో ఈ స్పెషల్ డ్యూయెట్ ప్లాన్ చేశారట దర్శకుడు పరుశురాం. షూటింగ్ త్వరగా ఫినిష్ చేసేందుకు గాను దుబాయ్ నుంచి నేరుగా గోవాకు ఫైట్ ఎక్కిందట ‘సర్కారు వారి పాట’ టీం. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై , జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ ‘సర్కారువారి పాట’ సినిమాలు నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు. బ్యాంకుల మోసం నేపథ్యంలో ఈ సినిమా కథ కొనసాగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button