టాలీవుడ్సినిమా

ఎట్టకేలకు మహేష్ మూవీ స్టాట్.. సెంటిమెంట్ రిపీట్..!

Mahesh Babu
చిత్రసీమలోని చాలామంది సెలబ్రెటీలు తమ సినిమాల విషయంలో ఏదో ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉంటారు. టాలీవుడ్లోని సెలబ్రెటీల్లోనూ ఇలాంటి సెంటిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఏమీ మినహాయింపు కాదు. ఆయన కూడా తన సినిమాల విషయంలో సెంటిమెంట్ నమ్ముతుంటాడు.

Also Read: ‘ఆచార్య’ సెట్లో సోనూసూద్ కు చిరుసత్కారం

మహేష్ బాబు తన సినిమా ఓపినింగ్ రోజు జరిగే కార్యక్రమాలకు ఎప్పుడూ హాజరు కాడని అందరికీ తెల్సిందే. అంతేకాకుండా ఆయన తన సినిమాలకు ఎక్కువగా మూడక్షరాల టైటిల్ ఉండేలా చూసుకుంటాడు. ఈ రెండు అంశాలు కూడా మహేష్ బాబు చాలాసార్లు వర్కౌట్ అయింది. దీంతో మహేష్ ఈ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ వెళుతున్నాడు.

తాజాగా మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారువారిపాట’. దర్శకుడు పర్శురాం ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. కరోనా వల్ల ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ హైదరాబాద్లోలోని ఓ దేవస్థానంలో ప్రారంభమైంది.

Also Read: ట్రోలింగ్ దెబ్బకు వెనక్కి తగ్గిన బాలయ్య..!

ఈ కార్యక్రమానికి మహేష్ బాబు దూరంగా ఉండగా మహేష్ భార్య నమ్రత.. కూతురు సితార పాల్గొన్నారు. నేటి ఉదయం లాంఛనంగా ప్రారంభమైన ‘సర్కారువారిపాట’ పూజ కార్యక్రమంలో నమ్రత కెమెరా స్విచ్చాన్ చేస్తే.. కూతురు సితార క్లాప్ కొట్టి ప్రారంభించింది. జనవరి మొదటి వారం నుంచి ఈమూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2022 సంక్రాంతికి ఈ మూవీ విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button