జనరల్టెక్నాలజీ

వాట్సాప్ కు భారీ షాక్.. ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

WhatsApp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు యూజర్లు భారీ షాక్ ఇచ్చారు. కొత్త ప్రైవసీ పాలసీపై తమలో ఇంకా సందేహాలు తొలగిపోలేదని ఒక అధ్యయంలో వెల్లడించారు. లోకల్ సర్కిల్ అనే ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం సర్వేను నిర్వహించగా వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్న 17 వేల మంది యూజర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది కొత్త ప్రైవసీ పాలసీ అమలులోకి వచ్చాక వాట్సాప్ యాప్ ను డిలేట్ చేశామని వెల్లడించారు.

Also Read: ఎయిర్ టెల్ కస్టమర్లకు శుభవార్త.. సెకన్లలో మూవీ డౌన్ లోడ్..?

22 శాతం మంది వాట్సాప్ తో పాటు ప్రత్యామ్నాయ యాప్స్ పై దృష్టి పెట్టామని గతంతో పోల్చి చూస్తే వాట్సాప్ యాప్ వినియోగాన్ని భారీగా తగ్గించామని తెలిపారు. సర్వేలో పాల్గొన్న వాట్సాప్ యూజర్లలో ఏకంగా 92 శాతం మంది వాట్సాప్ యాప్ యూజర్ల కొరకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ పేమెంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించమని తెలిపారు. 79 శాతం మంది వాట్సాప్ ను వినియోగించినా కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ వెనక్కు తగ్గకపోతే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ లను మాత్రం వినియోగించబోమని తెలిపారు.

Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. మరో కొత్త ఫీచర్..?

55 శాతం మంది వాట్సాప్ ప్రత్యామ్నాయంగా ఇతర యాప్ లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. 72 శాతం మంది తాము వాట్సాప్ యాప్ ను కాకుండా ప్రత్యామ్నాయ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే యూజర్లలో చాలామంది కొత్త ప్రైవసీ పాలసీ అమలును బట్టి తమ నిర్ణయాలు ఉంటాయని చెబుతుండటం గమనార్హం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లోనే వాట్సాప్ యూజర్లు ఎక్కువగా ఉన్నారు.

మరిన్ని వార్తలు కోసం: మొబైల్స్

ఒక అంచనా ప్రకారం మన దేశంలో దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ అమలును మే 15వ తేదీకి వాయిదా వేయగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రైవసీ పాలసీలోని మార్పులను ఉపసంహరించుకోవాలని వాట్సాప్ ను కోరడం గమనార్హం.

Back to top button